Movie News

భయపడింది జరగకపోవడమే బలమయ్యింది

రణబాలి విడుదలకు ముందు దానిమీద ప్రీ నెగిటివిటీ ఉన్న మాట వాస్తవం. ట్రైలర్, టీజర్ వల్ల కావొచ్చు లేదా ఇంకేదైనా కారణం ఉండొచ్చు కానీ దాన్ని టార్గెట్ చేసిన కొన్ని సోషల్ మీడియా వర్గాలు రిలీజ్ వరకు ఎదురు చూశాయి. దానికి తగ్గట్టే రివ్యూలు, పబ్లిక్ టాక్ మిశ్రమంగా ఉండటంతో ఇది ఎలాంటి ఫలితం అందుకుంటుందోననే అనుమానం అభిమానుల్లో కలిగింది. అయితే వీకెండ్ వరకు రణబాలి ఊహించిన దానికన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేయడం ఊరట కలిగించే విషయం.

అలాని యునానమస్ గా రణబాలిని ప్రేక్షకులు అంగీకరించారని చెప్పలేం కానీ ప్యారడైజ్ లాగా తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడకపోవడం పెద్ద రిలీఫ్. వసూళ్లను చూస్తే ఒకసారి చూడొచ్చనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉండటం వల్లే మంచి నెంబర్లు నమోదయ్యాయని చెప్పొచ్చు. మరో ముఖ్యమైన రీజన్ ఏంటంటే జైలర్ 2 తప్ప వేరే ఆప్షన్ పండక్కు లేకపోవడం ఇక్కడ కలిసి వచ్చింది. మాములు రోజుల్లో వచ్చి ఉంటే ఈ ఫలితాలు ఇలాగే ఉంటాయా అంటే చెప్పలేం కానీ ఇప్పుడైతే పని జరిగిన మాట వాస్తవం.

అయితే సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు ఎలా ఉంటాయనేది రణబాలికి కీలకం కానుంది. హాలిడేస్ ఇంకా అయిపోలేదు. పండగ రేపు ఉంది. తర్వాత కూడా స్కూళ్ళు కాలేజీలు వెంటనే తెరుచుకోవడం లేదు. గురువారం కొంచెం డ్రాప్ అయినా తిరిగి శని ఆదివారాలు ఇంకో అవకాశం దొరుకుతుంది. ఈ వారం చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు స్టార్ హీరోలవి లేకపోవడం ఇక్కడ చాలా ప్లస్ కానుంది. వాటిని విజయ్ దేవరకొండ వసూళ్లుగా మార్చుకుని ఏ మేరకు వాడుకుంటాడో చూడాలి.

ఒకవేళ రణబాలి కనక చాలా బాగుందనే టాక్ తెచ్చుకుని ఉంటే లెక్క వేరుగా ఉండేది. రౌడీ బాయ్ కోరుకున్న రిజల్ట్ బంగారు పళ్లెంలో దక్కేది. అయినా కూడా తీవ్రంగా నిరాశపడేందుకు లేదు. తన పుల్లింగ్ పవర్ ఇంకా ఉందని విజయ్ కు అర్థమయ్యింది. ఇకపై ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. హీరో దర్శకుడు, మిగిలిన టీమ్ పడిన కష్టం తెరమీద కనిపించింది కాబట్టే జనం మరీ అటాకింగ్ గా కామెంట్స్ చేయలేకపోయారు. రౌడీ జనార్ధన కనక వీటిని సరిదిద్దుకుంటే ఫ్యాన్స్ టెన్షన్లు తీరిపోతాయి.

This post was last modified on October 19, 2026 12:07 pm

Share

Recent Posts

రామాయ‌ణం డైరెక్ట‌ర్ కూడా తెలుగు సినిమా పిచ్చోడే

ఇత‌ర భాష‌లకు చెందిన సినీ జ‌నాలు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన‌పుడు కొంచెం క‌ష్ట‌ప‌డి బాగున్నారా అని..…

31 minutes ago

వైబ్ సరిపోవడం లేదు తమన్ సాబ్

ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. మాలా తెచ్చా పాలు అంటూ రామజోగయ్య శాస్త్రి…

46 minutes ago

ఎవ‌రీ లారెన్స్ బిష్ణోయ్‌?

బాలీవుడ్ న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘ‌ట‌న ఇప్పుడు దేశ్యాప్తంగా సంచ‌లనం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ముంబ‌యిలో ఫుట్…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్‌ని తవ్వుతున్న కాకా

సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…

3 hours ago

అనంత‌పురం అంటే అంతే సార్‌!

అనంత‌పురం జిల్లా అంటేనే రాజ‌కీయాల‌కు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నికల స‌మ‌యంలోనూ ఈ జిల్లా…

6 hours ago

పి సుశీల బయోపిక్‌లో రుక్మిణి వసంత్

బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్…

6 hours ago