ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు చేయడానికి అంతగా ఇష్టపడరు. ఎందుకంటే మాస్ జనాలు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానం వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. బిగ్ బాస్ లో చిరంజీవి కాసేపు అయ్యప్ప దీక్షలో ఉండే ఎపిసోడ్ చేశారు కానీ కంటెంట్ పరంగా పెద్దగా పనవ్వలేదు. ఆ తర్వాత ఆ రిస్కు ఎవరూ చేయలేదు. దర్శకుడు శివ నిర్వాణ ఈ నెగటివ్ సెంటిమెంట్ బ్రేక్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు.
ఇప్పుడదే కోవలో అల్లరి నరేష్ వెళ్తున్నాడు. తన కొత్త సినిమా కనకదుర్గ త్వరలోనే విడుదల కానుంది. ఇందులో హీరో పాత్ర భవాని మాల వేసుకుంటుంది. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు నలభై రోజుల పాటు ఎంతో నిష్ఠగా దీక్ష చేపట్టి అమ్మవారి ఆశీసులు పొందుతారు. అయితే కనకదుర్గ సినిమాలో హీరో పాత్ర ఎలా ఉంటుంది, బ్యాక్ డ్రాప్ ఏ తరహాలో జరుగుతుందనే డీటెయిల్స్ బయటికి చెప్పలేదు కానీ ఫాంటసీ ఎలిమెంట్స్ బలంగా ఉంటాయట.
కనకదుర్గలో మొదటి పాటని తాజాగా విడుదల చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే తమన్ కంపోజ్ చేయడం. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ డ్రామాకు బివిఎస్ రవి రచన అందించారు. బడ్జెట్ కూడా బాగానే ఖర్చు పెట్టారని ఇన్ సైడ్ టాక్. షూటింగ్ కీలక దశలో ఉండగా ఈ ఏడాదే రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. నిజానికి దసరాకే అనుకున్నారట కానీ చాలా పనులు పెండింగ్ లో ఉండటం, ప్రమోషన్లకు సమయం లేకపోవడం వల్ల చేయలేదని టాక్.
దీని సంగతలా ఉంచితే రవితేజ చూపించిన రూటు అల్లరి నరేష్ కు కూడా సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. కనకదుర్గ పేరులోనే బోలెడంత పాజిటివ్ వైబ్ ఉంది. కంటెంట్ తో కనక మెప్పిస్తే నిజంగానే కనకవర్షం కురుస్తుంది. రంభ ఊర్వశి మేనక మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే దాని ఫలితం తీవ్రంగా నిరాశ పరచడంతో ఇప్పుడు కొత్త దారి పట్టాడు. ఇంటెన్స్ డ్రామా, హారర్, మెసేజ్ ఓరియెంటెడ్ ఇలా అన్ని ట్రై చేశాక అల్లరి నరేష్ కు హిట్టు ఇవ్వాల్సిన బాధ్యత కనకదుర్గ మీద ఉంది.
This post was last modified on October 17, 2026 7:11 pm
భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి…
మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…
యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…
వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉన్న ఆయన…
స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఎంతో మంది వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు ఉన్నారు. ఈ పార్టీల తరఫున…