Movie News

తెలుగు వాళ్లకు ఆయన చాలా స్పెషల్

వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోయారు. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో దిగ్గజ స్థాయిని అందుకున్న సంగీత దర్శకుడు దేవా గుండెపోటుతోనే చనిపోయారు. పేరుకు తమిళుడే కానీ.. తెలుగు వారితో దేవాకు గొప్ప అనుబంధమే ఉంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే కానీ.. ఆయన వేసిన ముద్ర చాలా బలమైంది.

నిన్నటితరం సంగీత ప్రియులను ఆయన వీనులవిందైన పాటలతో అలరించారు. తెలుగులో చేసిన మిగతా సినిమాలన్నీ ఒకెత్తయితే.. ‘తొలి ప్రేమ’ మరో ఎత్తు. అందులో ప్రతి పాటా ఆణిముత్యమే.. నా మనసే, గగనానికి ఉదయం ఒకటే, ఏమి సోదరా, ఏమయిందో ఏమో ఈ వేళ.. ఇలా ప్రతి పాటా సూపర్ హిట్టే. ఇప్పటికీ ఆ పాటలు విని మైమరిచిపోతుంటారు సంగీత ప్రియులు. పవన్ కళ్యాణ్ కెరీర్లో నంబర్ వన్ ఆల్బం స్థానానికి గట్టి పోటీ ఇస్తుంది ‘తొలిప్రేమ’.

పవన్‌కే కాదు.. చిరుకు సైతం దేవా మరపురాని ఆల్బం ఇచ్చారు. ఆ చిత్రమే.. మాస్టర్. అందులో ‘తిలోత్తమ’ పాట ఆల్ టైం క్లాసిక్ సాంగ్స్‌లో ఒకటి. ఈ సినిమాలో మిగతా పాటలూ బాగుంటాయి. ఇంకా ‘ఆటోడ్రైవర్’ సినిమాలో ‘చందమామ చందమామ’ సాంగ్ కూడా ఒక క్లాసికే. జూనియర్ ఎన్టీఆర్ ‘నాగ’, వడ్డే నవీన్ ‘బాగున్నారా’ చిత్రాలకు కూడా మంచి మంచి పాటలే ఇచ్చారు దేవా.

ఇక తమిళంలో అయితే బాషా, అన్నామలై, అరుణాచలం, వాలి సహా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌కు సంగీతం అందించారు దేవా. వీటిలో చాలా సినిమాలు తెలుగులోనూ విజయవంతం అయ్యాయి. వాటి పాటలు ఇక్కడా అలరించాయి. మొత్తంగా 400 సినిమాలకు పైగా ఆయన మ్యూజిక్ చేయడం విశేషం. ‘జర్నీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జై.. దేవా మేనల్లుడే కావడం విశేషం. దేవా కొడుకు శ్రీకాంత్ దేవా కూడా సంగీత దర్శకుడిగా పని చేశాడు.

This post was last modified on October 17, 2026 3:15 pm

Share

Recent Posts

కంపెనీకి చివరి మెయిల్.. ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు!

భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి…

2 hours ago

దుల్కర్ సల్మాన్‌కు ఇక్కడే రాసిపెట్టి ఉంది

మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…

2 hours ago

ప్రభుత్వమే తెచ్చిన డేటింగ్ యాప్ కానీ…

యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…

3 hours ago

రవితేజ రూటు పట్టిన అల్లరి నరేష్

ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…

5 hours ago

అందరికీ న్యాయం చేసిన టీడీపీ

స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…

5 hours ago

అత్తాకోడళ్ల మధ్య కర్నూలు మేయర్ వార్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఎంతో మంది వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు ఉన్నారు. ఈ పార్టీల తరఫున…

6 hours ago