కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి రిలీజ్ డేట్ల వ్యవహారం గురించి పంచులు వేశారు. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకపోయినా, అన్నది దేని గురించో ఈజీగా అర్థం చేసుకున్న మూవీ లవర్స్ ఆయనకు మద్దతు పలుకుతున్నారు. అక్టోబర్ 30 విడుదల కాబోతున్న ఇట్లు అర్జున ఈవెంట్ లో వీటి ప్రస్తావన వచ్చింది. నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ యూత్ యాక్షన్ డ్రామాకు తమన్ సంగీతం సమకూర్చగా నిర్మాతల్లో ఒకరిగా వెంకీ కుడుముల వ్యవహరించడం విశేషం.
ఇక నాగ్ అన్న మాటల సారాంశం ఏంటో చూద్దాం. ఇట్లు అర్జున ముందు అనుకున్న తేదీ అక్టోబర్ 2. సరిగ్గా అదే డేట్ కి ఒక పెద్ద సినిమా రిలీజ్ అనౌన్స్ మెంట్ ఇవ్వడం వీళ్ళు కాస్తా అక్టోబర్ 9 వెళ్ళిపోయారు. తీరా చూస్తే అదే డేట్ కి అదే పెద్ద సినిమా ఇంకోసారి పోస్ట్ పోన్ అంటూ కర్చీఫ్ వేసింది. దీంతో ఈ గోలంత ఎందుకని ఇట్లు అర్జున నెలాఖరుకు వెళ్ళిపోయింది. తీరా చూస్తే సదరు పెద్ద మూవీ రానేలేదు. నాగ్ అన్నది ఆదర్శ కుటుంబం ఏకె 47 గురించేనని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు.
కావాలని ఎవరూ డేట్లు బ్లాక్ చేసుకుని వాయిదా వేసుకోరని, కానీ సరైన ప్లానింగ్ ఉంటే వాటిని అందుకోవడం కష్టం కాదనే రీతిలో నాగార్జున పలు సూచనలు చేశారు. కింగ్ 100 కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నామని, డిసెంబర్ 24 ప్రకటించాం కాబట్టి దానికి కట్టుబడేందుకు ఎంత చేయాలో అంతా చేస్తామనే రీతిలో సంకేతం ఇచ్చారు. ఇప్పుడైనా ఎలాంటి అడ్డంకులు రాకుండా ఇట్లు అర్జున అక్టోబర్ 30 రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు స్టేజి మీదే చెప్పారు.
ఈ టాపిక్ ఇండస్ట్రీకి కొత్త కాకపోయినా ఈ వాయిదాల పర్వం మాత్రం అంతకంతా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. దీని వల్ల ఇతర మీడియం, చిన్న సినిమాలు మంచి డేట్లు వదులుకుని ఒకరంగా నరకం చూస్తున్నాయి. ఇట్లు అర్జునకి మంచి బ్యాకప్ ఉన్నప్పటికీ హీరో కొత్తవాడే కాబట్టి ప్రమోషన్లు చాలా కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే పాటలతో సహా మేజర్ కంటెంట్ వాడేశారు. సో ఇక ఎలాంటి బ్రేకులు లేకుండా వచ్చేయడమే అర్జునకు సేఫ్ గేమ్ అవుతుంది. నాగ్ కోరుకుంటున్నది అదే.
This post was last modified on October 16, 2026 9:18 pm
అనిరుధ్ రవిచందర్ పేరుకు తమిళ సంగీత దర్శకుడే కానీ.. ప్రస్తుతం ఇండియాలో అతనే నంబర్ వన్ అనడంలో ఎవరికీ సందేహాలు…
ఆ యువతీ యువకులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుని స్థిరపడదామని అనుకున్నారు. కానీ, విధి వక్రించింది. ఓ వ్యక్తిని…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు శుక్రవారం తెరదీశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. తొలిరోజే ఉమ్మడి కడప, ఉమ్మడి…
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్టరీ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు…
నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…
తాజాగా విడుదలైన జైలర్ 2లో అసలు హీరోయినే లేకపోవడం మనం మొదటి భాగంలోనూ చూశాం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…