Political News

ఏపీలో నామినేష‌న్ల తొలిరోజు: ర‌ణ‌రంగ‌మే!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు శుక్ర‌వారం తెర‌దీశారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అయితే.. తొలిరోజే ఉమ్మ‌డి క‌డ‌ప, ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాల్లో తీవ్ర ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. టీడీపీ-వైసీపీ నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న ఈ ఘ‌ర్ష‌ణ‌ల‌లో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇదేస‌మ‌యంలో భారీ వాహ‌నాల‌కు కొంద‌రు నిప్పు పెట్ట‌డంతో అగ్గి రాజుకుని.. మ‌రిన్ని వాహ‌నాలు త‌గ‌ల‌బ‌డ్డాయి. మొత్తంగా.. నామినేష‌న్ల తొలి రోజే ఆయా ప్రాంతాల్లో అరాచ‌కం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఎక్క‌డెక్క‌డ ఎలా?

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో 15 కార్లు ధ్వంసమయ్యాయి. నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వైసీపీ కార్యాలయం వద్ద కూడా ఆందోళ‌న కారులు వాహనాలకు నిప్పు పెట్టారు. అదేస‌మ‌యంలో ఈ మంట‌లు కార్యాల‌యానికి కూడా అంటుకోవ‌డంతో వైసీపీ కార్యాల‌యం కూడా మంట‌ల్లో చిక్కుకుంది. ఇక్క‌డ తొలిరోజు నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో వైసీపీ నాయ‌కులు పాల్గొంటున్న స‌మ‌యంలో టీడీపీ నేత‌లు కూడా పోటీప‌డ‌డంతో ఘ‌ర్ష‌ణ నెల‌కొని రాళ్ల‌దాడి, నిప్పు పెట్టుకునే వ‌ర‌కు ప‌రిస్థితి చేరింది.

ఇక‌, పుంగ‌నూరులోనూ ఉద‌యం నుంచి ర‌ణ‌రంగ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పుంగనూరులో నామినేషన్ల వేళ ఉద్రిక్తత నెల‌కొని టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మున్సిపల్ ఎన్నిక‌ల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు వైసీపీనాయ‌కులు రాగా.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వీరిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇది ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ‌కు దారితీసింది. ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన అనుచరులు త‌న‌పై దాడి చేశార‌ని టీడీపీ నేత మధు రాయల్ ఆరోపించారు. నామినేషన్ వేయడానికి వెళ్తున్న టీడీపీ అభ్యర్థులు, పోలీసులపైకి కారుతో దూసుకొచ్చార‌ని తెలిపారు.

ఘర్షణలో వాహనాలు ధ్వంసమ‌య్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన‌ పోలీసులు.. గాలిలోకి కాల్పులు జ‌రిపి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. కాగా.. తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితి .. స్థానిక ఎన్నిక‌ల్లో కొత్త కాదు. గ‌తంలో 2021లో అధికారంలో ఉన్న వైసీపీ నాయ‌కులు కూడా ఇలానే ర‌ణ‌రంగం సృష్టించారు. టీడీపీ నాయ‌కులు, జ‌న‌సేన నాయ‌కుల‌పై విచ్చ‌ల‌విడిగా విరుచుకుప‌డ్డారు. ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో అప్ప‌ట్లోనూ ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి.

This post was last modified on October 16, 2026 8:18 pm

Share

Recent Posts

సీబీఐకి సాయికృష్ణ కేసు: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

విజ‌య‌వాడ కృష్ణ‌లంక‌కు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్ట‌రీ కేసులో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు…

38 minutes ago

జైలర్ 2 కత్తిరింపుల మీద అనుమానాలు

నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…

44 minutes ago

లేడీ విలన్‌ని వాడుకోవడం ఒక కళ

తాజాగా విడుదలైన జైలర్ 2లో అసలు హీరోయినే లేకపోవడం మనం మొదటి భాగంలోనూ చూశాం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…

3 hours ago

రామాయణ లెక్కలు ఇప్పుడు సరిపోయాయా

నిన్న బెంగళూరులో రామాయణ పార్ట్ 1 కొత్త ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. రావణుడిగా నటించిన యష్ మెయిన్…

3 hours ago

దేవరకొండ జంటను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు

ఇవాళ రణబాలి థియేటర్లలో అడుగు పెట్టింది. ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినపప్పటికీ కంటెంట్ మీద నమ్మకాన్ని వ్యక్తం…

4 hours ago

దేశంలో గందరగోళం సృష్టించేందుకు లైసెన్స్ ఇవ్వలేదు

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీల…

5 hours ago