Movie News

పెళ్లికి ముందే బిడ్డ కావాలంటున్న‌ హీరోయిన్

పేరుకు మ‌ల‌యాళ అమ్మాయే కానీ.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కెరీర్లో ఎక్కువ‌గా తెలుగు సినిమాలే చేసింది. ఇక్క‌డ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. తెలుగ‌మ్మాయిలా క‌లిసిపోయింది. తాజాగా క్రేజీ క‌ళ్యాణం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అనుప‌మ‌.. వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఆస‌క్తిక‌ర కామెంట్ చేసింది. తన‌కు పెళ్లికి ముందే బిడ్డ కావాలంటూ ఆమె వ్యాఖ్యానించింది.

పెళ్లికి ముందే పిల్ల కావాలి.. బిడ్డ‌ను క‌నాలి అంటూ ఆమె ఒక ప్ర‌మోష‌న‌ల్ ప్రెస్ మీట్లో చేసిన కామెంట్‌కు విలేక‌రులు ఒకింత ఆశ్చ‌ర్య‌పోయి, అదెలా అని అడిగారు. అందుకామె బ‌దులిస్తూ.. ఎలా ఏముంది నార్మ‌ల్‌గా బిడ్డ‌ను క‌నొచ్చు. ఐవీఎఫ్ ద్వారా క‌నొచ్చు. ద‌త్త‌త కూడా తీసుకోవ‌చ్చు అని పేర్కొంది. త‌న‌కు పెళ్ల‌వుతుందో లేదో కానీ.. అంత‌కంటే ముందు ఏదో ఒక ర‌కంగా ఒక బిడ్డ‌కు త‌ల్లి కావ‌డం మాత్రం ఖాయ‌మ‌న్న‌ట్లు అనుప‌మ మాట్లాడింది.

అనుప‌మ కొన్ని నెల‌ల ముందు వ‌ర‌కు ఒక సీరియ‌స్ రిలేష‌న్‌షిప్‌లో ఉంది. త‌మిళ హీరోతో ఆమె ప్రేమ‌లో ప‌డిందనే పుకారు జోరుగా చక్కర్లు కొట్టింది. కానీ త‌ర్వాత వీరి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయి. ఈ మ‌ధ్య పేరెత్త‌కుండా.. తానొక టాక్సిక్ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు చెబుతూ, తీవ్ర వ్యాఖ్య‌లే చేసింది అనుప‌మ‌. ఆ బంధంలో ఉండ‌గా తాను న‌ర‌క‌యాత‌న అనుభ‌వించాన‌ని, త‌న ఆరోగ్యం కూడా దెబ్బ‌తింద‌ని, ఇప్పుడే మామూలు మ‌నిషిని అయ్యాన‌ని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇక అనుప‌మ ఫిలిం కెరీర్ విష‌యానికి వ‌స్తే ఆమెకు ఓ మంచి హిట్ ప‌డి చాలా కాల‌మైంది. బైస‌న్ త‌ర్వాత ఏ సినిమా ఆడ‌లేదు. తెలుగులో గ‌త ఏడాది చేసిన‌ ప‌ర‌దా నిరాశ‌ప‌రిచింది. త‌మిళంలో న‌టించిన లాక్ డౌన్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ద‌స‌రా కానుక‌గా రిలీజైన తెలుగు మూవీ క్రేజీ క‌ళ్యాణం యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంటోంది.

This post was last modified on October 17, 2026 10:27 am

Share

Recent Posts

ఈ కారణంతో సాయిపల్లవిని ద్వేషించడమా?

ఒకప్పుడు నటీనటుల అందచందాలు, యాక్టింగ్ స్కిల్స్‌ను బట్టే సినిమాలు చూసేవారు జనాలు. కానీ సోషల్ మీడియా జమానాలో సినిమాలు చూడ్డానికి,…

12 minutes ago

ఇండస్ట్రీ హిట్… ఎవ్వరికీ ఇవ్వవా రజినీ?

ఎప్పుడో 1998లో కమల్ హాసన్ ‘ఇండియన్’ సినిమాతో తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్నుంచి 28 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో…

1 hour ago

ఆదిపురుష్ భయం.. రామాయణంను వెంటాడుతోందా?

ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రామాయణం: పార్ట్1’ సినిమా. రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల…

4 hours ago

అక్క‌డ వైసీపీ జీరో నుంచి మొద‌లెట్టాల్సిందే

ఏపీలో స్థానిక ఎన్నిక‌ల వేళ ప‌రిణామాలు చూస్తుంటే కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ జీరో అయిపోయింది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి…

7 hours ago

తొమ్మిది రోజుల ముందే రామాయణం మెగా ప్రిమియర్

ఏకంగా 4 వేల బడ్జెట్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టు.. రామాయణం. రెండు భాగాలుగా ఈ మెగా మూవీ తెరకెక్కుతుండగా.. ఫస్ట్…

12 hours ago

రామాయ‌ణం డైరెక్ట‌ర్ కూడా తెలుగు సినిమా పిచ్చోడే

ఇత‌ర భాష‌లకు చెందిన సినీ జ‌నాలు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన‌పుడు కొంచెం క‌ష్ట‌ప‌డి బాగున్నారా అని..…

13 hours ago