భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా.. జైలర్-2. అంచనాలకు తగ్గ రేంజిలో లేకపోయినా.. పైసా వసూల్ ఎంటర్టైనర్ అనే టాక్ వస్తోంది ఈ చిత్రానికి. సౌత్ ఇండియన్ సినిమాలో సీక్వెల్స్.. ఎప్పుడూ ఒరిజినల్స్ కంటే తక్కువ స్థాయిలోనే ఉంటాయి. మాతృకను మించి సీక్వెల్ గొప్పగా అనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ‘జైలర్-2’కు వస్తున్న టాక్ చూస్తే.. ఇది కంటెంట్, వసూళ్ల పరగా ‘జైలర్’ను అధిగమించడం సందేహంగానే ఉంది. ఐతే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రం చాలా ధీమాగా ‘జైలర్-3’కి లీడ్ సీన్ పెట్టేశాడు. ఈ సినిమా చివర్లో రజినీ అరెస్టయి పోలీస్ జీపు ఎక్కుతాడు.
ఆయన్ని తీసుకెళ్లే పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి తళుక్కున మెరిశాడు. ‘జైలర్’లో మాదిరే ‘జైలర్-2’లో చాలా క్యామియోలు ఉండగా, వాటి గురించి ముందే హింట్ వచ్చింది. హృతిక్ రోషన్ క్యామియో గురించి కూడా న్యూస్ ఎప్పుడో లీక్ అయింది. కానీ ఇందులో విజయ్ సేతుపతి కూడా కనిపించనున్న విషయంలో మాత్రం సీక్రెట్‌గా బాగానే దాచారు. ఐతే ఇది జస్ట్ క్యామియో కాదు, ‘జైలర్’ ఫ్రాంఛైజీలో మరో సినిమా దిశగా లీడ్ ఇచ్చిన పాత్ర అని భావిస్తున్నారు.
మూడో ‘జైలర్’లో సేతుపతినే ప్రధాన విలన్‌గా చూపించాలని నెల్సన్ ఫిక్సయినట్లున్నాడు. కానీ అతనా సినిమా తీయాలి అంటే ‘జైలర్’ తరహాలోనే ‘జైలర్-2’ కూడా పెద్ద హిట్టవ్వాలి. ఒకవేళ వసూళ్లు వచ్చినా సరే.. ‘జైలర్-2’కే మొనాటనస్ ఫీలింగ్ వచ్చిన నేపథ్యంలో ప్రేక్షకులు ఇంకో సినిమా చూడ్డానికి రెడీగా ఉంటారా అన్నది సందేహం.
సేతుపతి ఇంతకుముందే రజినీ సినిమాలో ఒకసారి నెగెటివ్ రోల్ చేశాడు. ‘పేట’లో సూపర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కానీ అందులో అతడిది పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదు. రజినీని ఢీకొట్టేలా ఆ పాత్ర ఉండదు. మరి ‘జైలర్-3’కు అన్నీ కుదిరి.. రజినీ, సేతుపతి మధ్య పూర్తి స్థాయి క్లాష్‌ను స్క్రీన్ మీద చూసే అవకాశం దక్కుతుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates