నిన్న జరిగిన రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ తన మీదే అందరి కంటే ఎక్కువ ట్రోలింగ్ జరిగిందని, అయినా సరే తట్టుకుని నిలబడ్డానని, ఇవన్నీ వృత్తి జీవితంలో మాములే అన్నట్టు విజయ్ దేవరకొండకు హితబోధ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. నిజానికి ఇతనొక్కరే కాదు పెద్దికి బుచ్చిబాబు, గేమ్ ఛేంజర్ కు శంకర్, ఫంకీకి అనుదీప్ ఇలా ఎందరో వీటిని చవి చూడాల్సి వచ్చింది. ఆఖరికి సౌమ్యుడిగా పేరున్న నాని సైతం ప్యారడైజ్ వల్ల ట్రోల్స్ చవి చూశాడు.
నిజాన్ని ఇలా ఓపెన్ గా ఒప్పుకోవడం చాలా మంచి విషయం. అయితే దానికి తగ్గట్టు గణనీయమైన మార్పు రావాలనేది మూవీ లవర్స్ కోరిక. హరీష్ శంకర్ ఉదాహరణే తీసుకుంటే రవితేజ మిస్టర్ బచ్చన్ దారుణంగా పోవడం వెనుక కారణాలు ఎన్ని ఉన్నా ప్రధాన బాధ్యత డైరెక్టర్ దే. మంచి మాస్ ఎంటర్ టైనర్ అవ్వాల్సిన బొమ్మ అవసరం లేని మార్పుల వల్ల డిజాస్టరయ్యింది. అయినా సరే పవన్ కళ్యాణ్ నమ్మి ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేశారు. కథ మారింది కానీ రిజల్ట్ రిపీటయ్యింది.
స్టార్ హీరోల చుట్టూ ఏళ్లతరబడి ప్రదక్షిణలు చేసినా దొరకని ఛాన్సులు హరీష్ శంకర్ కు తక్కువ గ్యాప్ లోనే వచ్చాయి. వాటిని నిలబెట్టుకుని ఉంటే ఇవాళ ఏ చిరంజీవిదో బాలకృష్ణదో పట్టాలు ఎక్కేది. అలాని ఆయనకు అవకాశాలు లేవని కాదు. రెండు మూడు నిర్మాణ సంస్థల అడ్వాన్సులు ఆల్రెడీ ఉన్నాయి. హీరో సెట్ అయితే సెట్స్ మీదకు వెళ్లిపోవడమే తరువాయి. కానీ ఈసారి మాత్రం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇంకో తప్పుకు స్పేస్ ఇవ్వకూడదు.
రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ తీసిన మారుతీకి తనను నమ్మే స్టార్లు వెంటనే దొరక్క తిరిగి ఎంటర్ టైన్మెంట్ జానర్ లోకి వెళ్లిపోతున్నారు. కొత్తవాళ్లతో ఒక కామెడీ మూవీ ప్లానింగ్ జరుగుతోందట. ఇంకా చెప్పాలంటే హరీష్ శంకర్ కన్నా దారుణంగా ట్రోల్ అయ్యింది మారుతీనే. చాలా బలంగా కంబ్యాక్ అవ్వాల్సి ఉంటుంది. పూరి జగన్నాథ్ సైతం ఇలాంటి ఫేజ్ చూస్తునే ఉన్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన వీళ్లంతా సరైన కంటెంట్ తో వస్తే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయి.
This post was last modified on October 14, 2026 10:41 am
దీపావళికి రామాయణ, సూర్య సీన్,. కిరణ్ అబ్బవరం నిర్మించిన హతతో పోటీ నెలకొనగా ఆ తర్వాత వారం శర్వానంద్ భోగి…
వీరమణి.. ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. మంచు విష్ణు సైతం ఈ పేరు వాడి ఒక ట్వీట్…
80, 90 దశకాల్లో తన డిస్కో డ్యాన్సులతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇప్పటికీ…
నీతి టేలర్.. ఈ పేరు గుర్తుందా? ‘నచ్చావులే’ ఫేమ్ తనీష్ అల్లాడి హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’ అనే…
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…