Movie News

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ హారర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరగరాస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, అది తీవ్రంగా నిరాశపరచడం ఇప్పట్లో మర్చిపోలేరు. దర్శకుడు మారుతీని నిందిస్తూ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్వీట్లు మెసేజులు పెడుతూనే ఉంటారు. దెబ్బకు ఆయన కొన్ని నెలల పాటు బయట కనిపించడం మానేశారు. ఇటీవలే ఒక ఈవెంట్ లో దర్శనమిచ్చారు.

తాజాగా గరివిడి లక్ష్మి ప్రెస్ మీట్ లో నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ రాజా సాబ్ కనక వేరే సీజన్ లో వచ్చి ఉంటే రిజల్ట్ మారేదని, సంక్రాంతికి రావడం వల్ల అనుకున్న ఫలితం దక్కలేదని కొత్త భాష్యం చెప్పారు. ఇది నిజంగా లాజిక్ కి అందనిది. ఎందుకంటే జనవరి పండగ సీజన్ లో అందరి కంటే ముందు వచ్చింది రాజా సాబ్. మూడు రోజులు ఓపెన్ గ్రౌండ్ దొరికింది. కనీసం యావరేజ్ ఉన్నా ప్రేక్షకులు నిలబెట్టేవారు. మరీ అత్తెసరు సరుకు కావడం వల్లే తిరస్కారానికి గురయ్యింది.

ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే రాజా సాబ్ కనక సోలోగా వేరే టైంలో వచ్చి ఉంటే వసూళ్లు ఇంకా తగ్గేవన్నది నిజం. ఎందుకంటే బ్యాడ్ కంటెంట్ కేవలం కాలాన్ని బట్టి మారదు. అజ్ఞాతవాసి, ఆచార్య, స్పైడర్ లాంటివి ఏ టైంలో వచ్చినా వాటి జాతకాలు మారిపోవు. రాజా సాబ్ కూడా అదే బాపతులోకి చేరుతుంది. విశ్వప్రసాద్ ఉద్దేశం ఇంకొంచెం మెరుగైన కలెక్షన్లు వచ్చేవన్న భావన కావచ్చు కానీ అమాంతం హిట్టయ్యే స్థాయికి వెళ్ళేది కాదు. ఇది ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు.

అయినా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడం అంత ఈజీ కాదు. పది రోజుల క్రితం రాజమౌళి ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మొదటి రోజే చేతులు ఎత్తేసింది. వాస్తవాన్ని గుర్తించిన జక్కన్న కుటుంబం వెంటనే సైలెంట్ అయిపోయింది. లేని హిట్టుని ఉన్నట్టుగా చూపించి ఫేక్ పబ్లిసిటీ చేయకుండా వదిలేశారు. ఫహద్ ఫాసిల్ ని కేరళకు పంపించారు. రాజా సాబ్ అయినా ఇంకో ఫ్లాప్ మూవీ అయినా కంటెంట్ లో దమ్ముంటే ఎలాంటి సీజన్ తో సంబంధం ఉండదు.

This post was last modified on October 13, 2026 5:32 pm

Share

Recent Posts

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

18 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

32 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

59 minutes ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

6 hours ago