Political News

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలో జరుగుతున్న ‘విజయవాడ ఉత్సవ్’లో విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగులో తన స్పీచ్ తో విజయ్ అదరగొట్టారు. ఇక్కడి ప్రజలను కలవడం సంతోషంగా ఉందని అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

నదుల అనుసంధానం గురించి సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు విజయవాడ వచ్చానని తెలిపారు. తనను ఈ ఉత్సవాలకు ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తనను ఇంతగా అభిమానించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత తమిళంలో మాట్లాడి తన స్పీచ్ ను ఆయన ముగించారు. విజయ్ మాట్లాడుతున్నంతసేపు యువకులు, ఆయన అభిమానులు కేకలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం విజయ్ స్పీచ్ నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతకుముందు, విజయవాడలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని విజయ్ దర్శించుకున్నారు. సీఎం విజయ్ కు ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. జగన్మాతకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలను విజయ్ కు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అందజేశారు.

This post was last modified on October 13, 2026 8:59 pm

Share

Recent Posts

చిరు లిస్టులోకి ఇంకో పేరు

70 ఏళ్లు పైబడ్డా సరే, ఈ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ తరం దర్శకులతోనూ…

1 hour ago

లాస్ట్ మినిట్ డైరెక్టర్లకు సెన్సార్ షాక్

మేకింగ్ టైంలో మాత్రం తాపీగా షూటింగ్ చేయడం.. అవసరం లేని షాట్లు తీసుకోవడం.. యాక్టర్ల డేట్లు వేస్ట్ చేయడం.. రీషూట్లు…

1 hour ago

బచ్చన్ సాబ్ బయటకి రావాలన్నా భయమే

కొన్ని రోజుల కింద‌ట బాలీవుడ్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్ మీద న‌డి రోడ్డుపై కొంద‌రు దుండ‌గులు తుపాకుల‌తో దాడికి పాల్ప‌డ‌డం…

3 hours ago

మోదీ షాలను దేశం నుంచి పారిపోనివ్వం

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు చేసింది అత్యంత అరుదైన నేరం, వారు న్యాయ ప్రక్రియ నుంచి ఎప్పటికీ…

5 hours ago

‘సినిమా – హింస’లోకి రామాయణాన్ని తెచ్చిన ఆర్జీవీ

రాప్తాడు ఘ‌ట‌న వెనుక యానిమ‌ల్ .. ఆర్జీవీ కౌంట‌ర్నిన్న ఏపీలోని అనంత‌పురం జిల్లా రాప్తాడులో జ‌రిగిన పాఠ‌శాల ఘ‌ట‌న ఎంత‌టి…

6 hours ago

అంబానీల అద్భుత కార్యం

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుల జాబితాలో ఉండే ముకేష్‌ అంబానీ కుటుంబానికి ఇండియాలో అస‌లు పోటీయే లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వారి సంప‌ద…

6 hours ago