Movie News

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ వచ్చాక సోషల్ మీడియా షేక్ అవుతుందనుకుంటే ఆ స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అంచనాలు విపరీతంగా ఏర్పడకుండా ఉండేందుకు అలా జాగ్రత్త పడ్డారా లేక అసలు కంటెంట్ కూడా అలాగే ఉంటుందానే అనుమానాలు జనంలో రాక మానవు. ఇప్పుడలాంటి సవాళ్లు చాలానే రాబోతున్నాయి.

వాటిలో మొదటిది దర్శకుడు నెల్సన్ తన ప్రతిభను మరింత బలంగా ఋజువు చేసుకోవడం. ఎందుకంటే కమల్ హాసన్, రజనీకాంత్ కలయికలో రాజ్ కమల్ సంస్థ అనౌన్స్ చేసిన మల్టీస్టార్ కు ఇతనే దర్శకుడు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వీడియో రూపంలో ఇచ్చి నెలలు గడిచిపోయాయి. ఇప్పుడిది ఉంటుందో లేదోననే అనుమానాలతో చెన్నై మీడియా వర్గాల్లో రకరకాల కథనాలు వస్తున్నాయి. కొందరు ఒక అడుగు ముందుకేసి అసలీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని ప్రచారం చేస్తున్నారు.

ఒకవేళ జైలర్ 2 ఫలితం ఏ మాత్రం అటు ఇటు అయినా పైన చెప్పింది నిజం కావొచ్చు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కలయికలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఒక భారీ చిత్రం ప్లాన్ చేసుకుంది. రెండేళ్ల క్రితమే చర్చలు జరిగాయి. కానీ డ్రాగన్ ఆలస్యంతో పాటు త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా మూవీని తారక్ ఓకే చేయడంతో ఇది కాస్త పక్కకు వెళ్ళింది. భవిష్యత్తులో కార్యరూపం దాల్చడం అనుమానంగానే ఉందని అంతర్గత వర్గాల సమాచారం.

ఇదంతా చూస్తుంటే జైలర్ 2 మీద పెద్ద బాధ్యతలే కనిపిస్తున్నాయి. టాక్ ఎలా వస్తుందనేది పక్కన పెడితే తమిళనాడుతో పాటు ఏపీ తెలంగాణలో పెద్ద ఓపెనింగ్ రావడం ఖాయమే. ఎందుకంటే ప్యారడైజ్ నిరాశ పరిచాక పెద్ద మాస్ సినిమా తెలుగులో రాలేదు. రణబాలి మరుసటి రోజు కాబట్టి ముందైతే ఫస్ట్ ఛాయస్ జైలర్ 2 అవుతుంది. కాకపోతే బాహుబలి, పుష్ప, కెజిఎఫ్ స్థాయిలో ఫ్రాంచైజ్ క్రేజ్ సృష్టించుకోవడంలో రజనీకాంత్ బృందం కొంచెం తడబడిన మాట వాస్తవం.

This post was last modified on October 9, 2026 3:28 pm

Share

Recent Posts

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

6 minutes ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

11 minutes ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

3 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

4 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

4 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

5 hours ago