Movie News

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు వచ్చే హైప్ అంతా ఇంతా కాదు. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన ‘రొమాంచకం’, అలాగే దిగ్గజ దర్శకుడు రాజమౌళి బ్యాకప్ తో వచ్చిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయాయి. ప్రమోషన్స్ వరకు ఈ పేర్లు బాగానే వాడుకున్నా, థియేటర్లలో కంటెంట్ తేలిపోవడంతో ఆ స్టార్ డైరెక్టర్ల బ్రాండ్ ఇమేజ్ ఈ సినిమాలను గట్టెక్కించలేకపోయింది.

ఈ విషయంలో మాత్రం లెక్కల మాస్టారు సుకుమార్ ట్రాక్ రికార్డే వేరు. తన శిష్యులను ఎంకరేజ్ చేస్తూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఆయన అందించిన సపోర్ట్ చాలా వరకు ఫెయిల్ అవ్వలేదు. కుమారి 21ఎఫ్, ఉప్పెన, విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన జడ్జిమెంట్ కు నిదర్శనం. కొన్నిసార్లు నిర్మాతగా, ఇంకొన్నిసార్లు రైటర్ గా ఉంటూనే కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసి భారీ హిట్లు అందుకున్న ఘనత సుక్కు సొంతం. కంటెంట్ లో దమ్ముంటేనే తన పేరును వాడుకునేలా ఆయన సెట్ చేసుకున్న ఫార్ములా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఇప్పుడు సరిగ్గా ఇదే రూట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కేజీఎఫ్, సలార్ సినిమాలకు పనిచేసిన కీర్తన్ నడగౌడను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘418’ అనే హారర్ థ్రిల్లర్ కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. కథ నచ్చడంతో నీల్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ ను మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో పెట్టాడు. అక్టోబర్ 23న రాబోతున్న ఈ మూవీ మెడికల్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సైన్స్, మూఢనమ్మకాల మధ్య సాగే కథతో తెరకెక్కింది. దీనికి సెన్సార్ నుంచి ‘A’ సర్టిఫికెట్ వచ్చింది.

స్టార్ కాస్ట్ లేకపోయినా మైత్రీ బ్యానర్, ప్రశాంత్ నీల్ బ్రాండ్ వల్లే ఈ ‘418’కి మొదటి నుంచి సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. స్టార్ డైరెక్టర్ వల్లే ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం. అయితే అసలు ఛాలెంజ్ రెండో రోజు నుంచే మొదలవుతుంది. నీల్, సుకుమార్ లాగా తన శిష్యుడి సినిమాను కంటెంట్ తో నిలబెడతాడా? లేక వంగా, జక్కన్నల్లాగా జస్ట్ అటెన్షన్ మాత్రమే తెచ్చిపెడతాడా అనేది చూడాలి.

This post was last modified on October 8, 2026 6:35 pm

Share

Recent Posts

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

45 minutes ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

3 hours ago

అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…

3 hours ago

సెన్సార్ బోర్డుపై కుండబద్దలు కొట్టిన కోన

సినిమాల సెన్సార్షిప్‌ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…

4 hours ago

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

5 hours ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

6 hours ago