సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వస్తే కొందరు వెంటనే డిఫెన్స్ లో పడిపోతారు. జనాలకు మా విజన్ అర్థం కాలేదనో, లాజిక్స్ వెతకకండి అనో కవర్ చేసుకుంటారు. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో న్యాచురల్ స్టార్ నాని రూటే సపరేట్. సినిమా బాలేదని తిడుతున్న ఆడియెన్స్ ను ఆయన ఏమాత్రం తప్పు పట్టలేదు. పైగా వాళ్ల ఆవేశం వెనుక ఉన్న అసలైన రీజన్ ఏంటో చాలా రియలిస్టిక్ గా హైలెట్ చేశాడు.
రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో సినిమాపై కాంట్రాస్టింగ్ రియాక్షన్స్ రావడం తనను కన్ఫ్యూజ్ చేసిందని నాని ఓపెన్ గా ఒప్పుకున్నాడు. నచ్చలేదని చెప్పేవాళ్ల కామెంట్స్ లో కూడా ఒక విపరీతమైన అగ్రెసివ్నెస్ కనిపించిందని, అదే తనకు చాలా పాజిటివ్ గా అనిపించిందని చెప్పాడు. థియేటర్ కు వచ్చేటప్పుడే నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో మీద వాళ్లు ఒక గట్టి నమ్మకం పెట్టుకున్నారని, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడే ఆ కోపం బయటకు వస్తుందని డీకోడ్ చేశాడు.
సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకపోతే జనాలు లైట్ తీసుకుంటారు. ఇంతలా ఫైట్ చేస్తున్నారంటే తమ కాంబినేషన్ మీద వాళ్లు పెంచుకున్న ట్రస్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని నాని చెప్పుకొచ్చాడు. వాళ్ల ఫీడ్ బ్యాక్ ను ఒక సెట్ బ్యాక్ లాగా చూడకుండా, భవిష్యత్తులో తమ నుంచి రాబోయే ప్రాజెక్టులకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ లాగా మార్చుకుంటామని ఆయన చాలా మెచ్యూర్డ్ గా రియాక్ట్ అయ్యాడు.
అదే ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీకాంత్ కూడా ఆడియెన్స్ వైపు నుంచి ఆలోచించాడు. ఆడియెన్స్ చేస్తున్న లాజికల్ కంప్లైంట్స్ అన్నీ నిజమేనని, ఎడిటింగ్ టేబుల్ మీద కొన్ని కీలకమైన ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ లేచిపోవడం వల్లే స్క్రీన్ మీద ఆ ఎమోషన్ కన్వే కాలేదని తన తప్పును ఒప్పుకున్నాడు. పేపర్ మీద ఉన్న క్లారిటీ తెరపై మిస్ అవ్వడం వల్లే జనాలకు కన్ఫ్యూజన్ వచ్చిందని ఆయన అంగీకరించాడు.
బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల హవా కనిపిస్తున్నా కళ్లు మూసుకోకుండా, తమ వర్క్ లో ఉన్న మైనస్ లను ఈ రేంజ్ లో పోస్ట్ మార్టం చేసుకోవడం ఇండస్ట్రీకే కొత్త. ప్రేక్షకుల విమర్శలను శత్రువుల్లా చూడకుండా, వాళ్ల ఆవేశాన్ని తమపై ఉన్న నమ్మకంగా చూసిన విధానం బాగుందనే కామెంట్స్ వస్తున్నాయి. బహుశా ఈ క్లారిటీ ఉండడం వల్లనే నాని ఒకటి ఫ్లాప్ అయినా మళ్ళీ ఆడియెన్స్ పల్స్ పట్టుకొని హిట్ కొడుతున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on September 29, 2026 12:04 pm
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…