కొంచెం పెద్ద స్థాయి సినిమా రిలీజవుతోందంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. సినిమా మీద పెట్టిన బడ్జెట్, దానికి ఉన్న క్రేజ్‌ను అనుసరించి పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు. నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి హైప్ కూడా ఉంది. దీంతో నిర్మాత రేట్ల పెంపుకే మొగ్గు చూపాడు.
ఐతే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడూ పెద్దగా ఇబ్బంది ఎదురు కాలేదు. ఎంత అడిగితే అంత రేట్లు ఇచ్చేస్తున్నారు. చాలా ముందుగానే జీవో రిలీజ్ అయిపోతోంది. కానీ తెలంగాణలో మాత్రం రేట్ల పెంపు చాలా సంక్లిష్టంగా తయారైంది. ‘పుష్ప-2’ రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ విషాదం తర్వాత కొన్ని నెలలు ఏ సినిమాకూ రేట్లే ఇవ్వలేదు. తర్వాత హైక్స్ మళ్లీ మొదలైనా.. జీవో తెచ్చుకోవడంలో చాలా తలనొప్పులు తప్పలేదు.
రిలీజ్ ముందు రోజు వరకు నాన్చి నాన్చి చివరికి జీవో రిలీజ్ చేసేవారు. దీని వల్ల పలు చిత్రాల బుకింగ్స్‌కు ఇబ్బంది ఏర్పడింది. వసూళ్ల మీద తీవ్ర ప్రభావం చూపింది. లేటెస్ట్‌గా ‘టాక్సిక్’ సినిమాకు కూడా ఇదే ఇబ్బంది ఎదురైంది. ప్రపంచంలో అన్ని చోట్లా డే-1 బుకింగ్స్ పూర్తి కావస్తున్న టైంలో తెలంగాణలో జీవో వచ్చింది. దీని వల్ల బుకింగ్స్ మీద గట్టి ప్రభావమే పడింది. ఏపీలో మాత్రం చాలా ముందే జీవో వచ్చేయడంతో కలిసొచ్చింది. ఇలా చాలా సినిమాలకు జరిగింది.
కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో కథ రివర్స్ అవుతోంది. ఈ చిత్రానికి చాలా ముందుగానే రేట్లు, షోల కోసం దరఖాస్తు చేశారు. ఐతే తెలంగాణలో ఆదివారం సాయంత్రానికి జీవో వచ్చేసింది. వెంటనే బుకింగ్స్ మొదలుపెట్టేశారు. ఇంకా బుధవారం రాత్రి ప్రిమియర్ షోలకు సంబంధించి బుకింగ్స్ మొదలు కాలేదు. డే-1 నుంచి రెగ్యులర్ షోలకు మాత్రం టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కానీ సోమవారం మధ్యాహ్నానికి కూడా ఏపీ జీవో మాత్రం రాలేదు.
అసలు ఆ జీవో ఎప్పుడొస్తుందో కూడా క్లారిటీ లేదు. బుధవారం రాత్రికే ప్రిమియర్స్ పడాల్సి ఉన్న నేపథ్యంలో శనివారం లేదా ఆదివారమే బుకింగ్స్ మొదలైతే బాగుండేది. ఈ ఆలస్యం వల్ల ప్రేక్షకులకు ఎదురు చూపులు తప్పట్లేదు. ఇది క్రేజున్న సినిమా కావడంతో ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోవడమే సరిపోతోంది సినీ ప్రియులకు. కనీసం ఎప్పుడు బుకింగ్స్ మొదలవుతాయో క్లారిటీ కూడా లేదు. విచిత్రంగా తెలంగాణ జీవో త్వరగా వచ్చేసి.. ఎప్పుడూ ఈజీగా, వేగంగా వచ్చే ఏపీ జీవో ఈసారి ఇంత ఆలస్యమవడం ఏంటో అర్థం కావట్లేదు.
This post was last modified on September 21, 2026 5:20 pm
ఇరుముడి థియేటర్ లో విడుదలైనప్పుడు ఒకలా, ఓటిటిలో వచ్చాక మరోలా డిస్కషన్స్ లో నిలుస్తోంది. ముఖ్యంగా ఒక బ్లాక్ బస్టర్…
కేవలం ఒక నెల రోజుల గ్యాప్ లో బాక్సాఫీస్ మూడు విలువైన పాఠాలు నేర్చుకుంది. ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి…
మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ తో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేయడంలో పృథ్విరాజ్ సుకుమారన్ ఎప్పుడూ ముందు వరసలో…
దేశంలో అతిపెద్ద వ్యాపార గ్రూపుల్లో ఒకటైన టాటాలో ఇప్పుడు కీలకమైన వివాదం కోర్టు వరకు వెళ్లే పరిస్థితి వచ్చింది. టాటా…
హైదరాబాద్‌లో కేవలం రూ.10 చిల్లర విషయంలో మొదలైన గొడవ ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు పోయే వరకు వెళ్లింది. రాజేంద్రనగర్…
తనపై భారీ అంచనాలు నెలకొన్నపుడు కబాలి, కాలా సినిమాలతో నిరాశపరిచాడు కానీ.. పా.రంజిత్ గొప్ప దర్శకుడనడంలో సందేహం లేదు. తొలి…