పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కతున్న చిత్రానికి ముందు నుంచి ‘ఫైటర్’ అనే టైటిలే ప్రచారంలో ఉంది. ఆ వర్కింగ్ టైటిల్‌తోనే షూటింగ్ చేస్తూ వచ్చారు. కానీ ఈ చిత్రానికి ఆ టైటిల్ ఫైనలైజ్ కాలేదని.. వేరే ఆకర్షణీయమైన టైటిల్ కోసం చూస్తున్నామని చిత్ర సమర్పకురాలు చార్మి కౌర్ ఇంతకుముందే ప్రకటించింది. అందులోనూ ఈ మధ్య హృతిక్ రోషన్ హీరోగా ‘ఫైటర్’ అనే సినిమా గురించి ప్రకటన రావడంతో పూరి-విజయ్ సినిమాకు వేరే టైటిల్ పెట్టబోతున్నారని తేలిపోయింది.
ఇప్పుడా టైటిలేంటో ప్రకటించారు. ‘లిగర్’ అంటూ వెరైటీ పేరు పెట్టారు ఈ సినిమాకు. ముందు చూడగానే అసలేంటీ టైటిల్ అనిపించింది. ఐతే చిత్ర బృందం సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాక కానీ విషయం బోధ పడలేదు. Lionలోని తొలి రెండు అక్షరాలు.. Tigerలోని చివరి మూడు అక్షరాలు తీసుకుని Liger అని పేరు పెట్టారట.
ఫస్ట్ లుక పోస్టర్ బ్యాగ్రౌండ్లో సింహం, పులి ఫొటోలు పెట్టడం.. టైటిల్ కింద ‘సాలా క్రాస్ బ్రీడ్’ అని క్యాప్షన్ ద్వారా ఈ టైటిల్ గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారన్నమాట. అయినా సరే.. జనాలకు విషయం బోధపడలేదు. టైటిల్ గురించి ఇంత ప్రయాస అవసరమా అన్న ఫీలింగ్ జనాలకు కలుగుతోంది. సోషల్ మీడియాలో చాలా వరకు జనాలు ఈ టైటిల్ విషయమై నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు.
టైటిల్ చాలా కృతకంగా, కృత్రిమంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాగ్రౌండ్లో సింహం, పులి పెట్టడం చూసి ఇదేదో సెకండ్ గ్రేడ్ సినిమాలా ఉందే అన్న కామెంట్లు చేస్తున్నారు. టైటిల్ ఏమాత్రం క్యాచీగా లేదని.. అంత ఈజీగా జనాల్లోకి వెళ్లదని అంటున్నారు. దీని బదులు లయన్ అనో, టైగర్ అనో పెట్టినా బాగుండేదని.. అసలు ‘ఫైటర్’ అనే టైటిలే రిజిస్టర్ చేయించుకుని ఉంటే ఇప్పటికే అలవాటు పడ్డ జనాల్లోకి అది ఈజీగా వెళ్లిపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 18, 2021 1:15 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…