Movie News

రుక్మిణి ఆలోచించి అడుగులు వేయాలి

డిసెంబర్ లో ఫౌజీ రావడం లేదని ఏ క్షణాన లీకయ్యిందో కానీ అప్పటి నుంచి ఆ స్లాట్ కోసం రకరకాలుగా పోటీ మొదలైపోయింది. ఆల్రెడీ నాగచైతన్య వృషకర్మ, విశ్వక్ సేన్ లెగసిలు అధికారికంగా ప్రకటనలు ఇచ్చేయగా మరికొన్ని వచ్చే ఆలోచనలో ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్. వాటిలో అలియాస్ రుక్మిణి ఒకటి. నితిన్ హీరోగా దండోరా ఫేమ్ మురళికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని న్యాచురల్ స్టార్ నాని బ్యానర్ పై ఆయన సోదరి దీప్తి ఘంట నిర్మాతగా శరవేగంగా రూపొందుతోంది.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం అలియాస్ రుక్మిణిని డిసెంబర్ 3 విడుదలకు రెడీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే అంత వేగంగా షూటింగ్ జరుగుతోందన్న మాట. శృంగార నవలలు రాసే రచయితగా ఇందులో నితిన్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని టాక్. అవుట్ ఫుట్ బాగా వస్తోందని, ప్యారడైజ్ లో చాలా బిజీగా ఉన్న నాని కొంత టైం తీసుకుని ఫుటేజ్ చూసి చాలా సంతృప్తి వ్యక్తం చేశారని యూనిట్ మాట. సో కంటెంట్ విషయంలో అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు.

అయితే రుక్మిణి కాంపిటీషన్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఎందుకంటే ఒకవేళ చైతు కనక తప్పుకోకపోతే తనతో క్లాష్ జానర్ పరంగా ఇబ్బంది అవ్వొచ్చు. ట్రెండ్ ప్రకారం చూసుకుంటే దానికి బజ్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్ కాబట్టి బిజినెస్ వర్గాల్లోనూ క్రేజ్ ఉంది. లెగసి మీద ఇప్పటికైతే వీర అంచనాలు లేవు కానీ తక్కువ అంచనా కూడా వేయలేం. విశ్వక్ సేన్ ఒక్కోసారి సడన్ ట్విస్టులు ఇస్తాడు.

ఈ ఏడాది రిలీజ్ కావాలని టార్గెట్ గా పెట్టుకున్న అలియాస్ రుక్మిణి డిసెంబర్ లోనే రావనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ తప్ప వేరే మార్గం ఉండకపోవచ్చు. ఎందుకంటే క్రిస్మస్ కి బాలయ్య దాదా, నాగార్జున కింగ్ 100, షారుఖ్ ఖాన్ కింగ్ తో పాటు హాలీవుడ్ మూవీ డ్యూన్ 3, అవెంజర్స్ డూమ్స్ డే ఉన్నాయి. సో ఓవర్సీస్ పరంగా ఇబ్బందవుతుంది. సంక్రాంతికి ఛాన్స్ ఉండదు. ఇవన్నీ క్యాలికులెట్ చేసుకునే అలియాస్ రుక్మిణి బృందం డిసెంబర్ 3 అనుకుంటుందేమో. చూడాలి.

This post was last modified on September 18, 2026 6:29 am

Share

Recent Posts

ఏఐ దూకుడుకు బ్రేకులు? కేంద్రం కీలక నిర్ణయం!

ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా, దానితో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్…

40 minutes ago

హరిబాబు హత్య.. ‘న్యాయం’పై జనాల్లో ఈ అభిప్రాయం ఎందుకు?

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఒక విషయాన్ని ఆలోచించేలా చేస్తున్నాయి. తన…

2 hours ago

వైష్ణవి సోదరుడే హత్య చేశాడు

ఆరు నెలల క్రితం హత్యకు గురైన ప్రముఖ యూ ట్యూబర్ వైషు అమ్మ ఫేమ్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు…

4 hours ago

EMI కట్టలేదని కిడ్నాప్.. బ్లడ్ అమ్మేశారు

దేశంలో రోజురోజుకో రకమైన దారుణం జరుగుతుంది. ఊహించని ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. కరుడుగట్టిన నేరస్తులు సైతం విస్తుపోయే విధంగా నేరాల…

4 hours ago

టిక్‌టాక్ ఫౌండర్ దెబ్బకు అదానీ వెనక్కి!

కొన్నేళ్లుగా భారత్ లో బ్యాన్ ఎదుర్కొంటున్న టిక్ టాక్ గుర్తింది కదా? ఇప్పుడు ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఆసియాలోనే అత్యంత…

4 hours ago

పవన్ అన్నకు నేను.. నాకు పవన్ అన్న

వైసీపీ అరాచక పాలనకు తెరదించేందుకు 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడిందని…

4 hours ago