Movie News

జీవితంలో ఈటీవీ చూడ‌ననుకున్న విజ‌య్…

తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన టీవీ ఛానెళ్ల‌లో ఈటీవీ ఒక‌టి. 90వ ద‌శ‌కంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న టైంలో ఫ్రీ ఛానెల్‌గా ఉంటూ ఇంటింటికీ చేరువైంది ఈటీవీ. ఆ ఛానెళ్ల‌లో సీరియ‌ళ్లతో పాటు న్యూస్ ప్రోగ్రాంలకూ ఎంతో ఆద‌ర‌ణ ఉండేది. కాక‌పోతే ఆ ఛానెల్లో ఎక్కువ‌గా పాత సినిమాలే ప్ర‌సారం అయ్యేవి. ఈ కార‌ణంతోనే తన‌కు ఈటీవీ అంటే అంత న‌చ్చేది కాదంటున్నాడు టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

తాను ఎప్పుడూ ఈటీవీ చూసేవాడిని కాద‌ని.. అందుకు సీరియ‌ళ్లంటే ఇష్టం లేక‌పోవ‌డంతో పాటు, పాత సినిమాల మీద అనాస‌క్తే అని త‌న త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కొత్త చిత్రం ఎపిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు విజ‌య్. ఐతే జీవితంలో ఎప్పుడూ ఈటీవీ చూడ‌ను అని కూడా అనుకున్న తాను కూడా ఈటీవీ విన్‌లో నైంటీస్ వెబ్ సిరీస్ చూశాన‌ని.. ఇలా చేసిన ఘ‌న‌త ఆ సిరీస్ ద‌ర్శ‌కుడు ఆదిత్య హాస‌న్‌దే అని విజ‌య్ అన్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌నాలతో పెద్ద ఎత్తున ఈటీవీ విన్ యాప్ డౌన్ లోడ్ చేయించిన ఘ‌న‌త కూడా అత‌డిదే అని.. ఆ యాప్‌కు రీచ్ పెంచింది అత‌ను డైరెక్ట్ చేసిన నైంటీస్ సిరీసే అని విజ‌య్ అన్నాడు. ఆ సిరీస్ చూశాక‌, ఈ డైరెక్ట‌ర్ తీసే సినిమాను టికెట్ కొని చూడాల‌ని అని తాను బ‌లంగా అనుకున్నాన‌ని విజ‌య్ చెప్పాడు. ఆదిత్య త‌న మ‌నిషి అని.. అత‌డిని ఎవ‌రేమ‌న్నా తాను ఊరుకోన‌ని.. త‌న‌ కోసం నిల‌బ‌డ‌తాన‌ని విజ‌య్ ఈ సంద‌ర్భంగా చెప్పాడు.

మ‌రోవైపు ర‌వితేజ సినిమా ఇరుముడి ఇర‌గాడేస్తుండ‌డంపై విజ‌య్ స్పందించాడు. ఈ సినిమా దూకుడు మామూలుగా లేద‌ని.. ర‌వన్న రాంపేజ్ నెక్స్ట్ లెవెల్ అని విజ‌య్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది టాలీవుడ్‌కు చాలా బాగా క‌లిసి వ‌స్తోందని.. వ‌రుస‌గా సినిమాలు హిట్టవుతున్నాయ‌ని.. అవి హిట్ట‌వ‌డం కంటే ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తుండ‌డం త‌న‌కెంతో ఆనందాన్నిస్తోంద‌ని విజ‌య్ వ్యాఖ్యానించాడు.

మున్ముందు రాబోయే సినిమాల‌న్నీ కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయంటూ ఎపిక్, ది ప్యార‌డైజ్, ర‌ణ‌బాలి, మైసా, ఈ న‌గ‌రానికి ఏమైంది-2, ఫౌజి, దాదా చిత్రాల గురించి ప్ర‌స్తావించిన విజ‌య్.. ఈ సినిమాల‌న్నీ బాగా ఆడ‌తాయ‌ని, టాలీవుడ్ 100 ప‌ర్సంట్ స్ట్రైక్ రేట్ సాధిస్తుంద‌ని.. ఇది ఆప‌రేష‌న్ టీఎఫ్ఐ అని వ్యాఖ్యానించాడు. త‌న తమ్ముడి సినిమా ఎపిక్ రిలీజ‌య్యాక వ‌చ్చే నెల త‌న చిత్రం ర‌ణ‌బాలి రిలీజ‌వుతుంద‌ని.. ఆ త‌ర్వాతి నెల ర‌ష్మిక మూవీ మైసా వ‌స్తుంద‌ని.. ఈ సినిమాల ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా తాను జ‌నాల‌ను క‌లుస్తూనే ఉంటాన‌ని విజ‌య్ అన్నాడు.

This post was last modified on September 8, 2026 10:46 pm

Share

Recent Posts

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ల‌క్ష‌ల మంది వీధిపాలు.. కార‌ణాలేంటి?

ఒక‌టి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. ల‌క్ష‌ల్లోనే ఉద్యోగాలకు ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు మంగ‌ళం పాడుతున్నాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫోక్స్…

3 hours ago

బుల్లితెరపైనే కాదు… వెండితెరపైనా సంచలనమే

ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…

4 hours ago

హై హై నాయకా… అది ఏం నాలుక?

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…

5 hours ago

నెగిటివిటీని తట్టుకుంటేనే సత్తా తెలుస్తుంది

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…

5 hours ago

మొదటిసారి పెట్రోల్ కార్లను దాటేసిన CNG, EVలు

భారత్‌లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…

5 hours ago

యష్ చేసిన పొరపాట్లే తప్పులుగా మారాయా

థియేటర్ల దగ్గర టాక్సిక్ కథ ముగిసిపోయింది కానీ దాని కథలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సర్దార్ దర్శకుడు మిత్రన్…

7 hours ago