Movie News

ప్యారడైజ్ నిలబెట్టుకోవాల్సింది అదొక్కటే

వాయిదాల ప్రచారాలకు చెక్ పెడుతూ నిన్న ప్యారడైజ్ బృందం మరోసారి సెప్టెంబర్ 24 విడుదలని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ వెనక్కు తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఆఘమేఘాల మీద పనులు పూర్తి చేస్తున్నారు. రీ రికార్డింగ్ కు సంబంధించి అనిరుధ్ రవిచందర్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆ మేరకు దాని వర్క్ కూడా వీలైనంత త్వరలో ఫినిష్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీద మాములు ప్రెజర్ లేదు.

ఇప్పుడు చేతిలో ఉన్నది కేవలం 16 రోజులు. ప్యాన్ ఇండియా ప్రమోషన్లు పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. నానికి ఇంటర్వ్యూలు ఇచ్చే టైం కూడా లేదని తెలిసింది. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, నేషనల్ మీడియాతో ముఖాముఖీ తప్ప ఇంకే స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉండకపోవచ్చని వినికిడి. సరే పబ్లిసిటీ సంగతి ఎలా ఉన్నా ఓపెనింగ్స్ గురించి ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే బజ్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి. ఆయా షేర్, యెషనాగుల కట్ట పాటలు మాయ మంత్రంలా పని చేశాయి.

ప్రమోషన్ల సంగతి పక్కన పెడితే ప్యారడైజ్ నిలబెట్టుకోవాల్సింది ఒకే ఒకటుంది. అదే కంటెంట్ మీద ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకం. ఇది అందరు హీరోల సినిమాలకు జరిగేదే అయినా నానికి ప్యారడైజ్ ఆ కోవలోకి రాదు. ఎందుకంటే దీని కోసం చాలా రిస్క్ చేశాడు. క్యారెక్టరైజేషన్ పరంగా సాహసం అనిపించే పాయింట్ ఒప్పుకున్నాడు. మొదటిసారి ఒక హీరో రెండు జెడలు వేసుకుని సినిమా మొత్తం నటించే కాన్సెప్ట్ కు ఎస్ చెప్పాడు. అన్నింటికి మించి రెండు సంవత్సరాలు దీని మీదే ఉన్నాడు.

ప్రేక్షకుల్లో ఇంత కష్టం చూసిన సానుభూతి ఎలాగూ ఉంది కాబట్టి వాళ్ళ ఎక్స్ పెక్టేషన్స్ కనీస స్థాయిలో అందుకున్నా చాలు బ్లాక్ బస్టర్ దక్కుతుంది. జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కు శుభ సూచకాలు జరుగుతున్నాయి. పెద్ది నుంచి ఇరుముడి దాకా మంచి హిట్లు పడ్డాయి. వీరభద్రుడు నుంచి బెత్లెహాం కుటుంబ యూనిట్ దాకా డబ్బింగులు సైతం విజయం సాధించాయి. ఈ ఫ్లోని ప్యారడైజ్ పది రెట్లు పైకి తీసుకెళ్తుందని డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆశిస్తున్నాయి. అంతకన్నా కావాల్సింది ఏముంది.  

This post was last modified on September 8, 2026 12:09 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

2 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

3 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

4 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

6 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

6 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

6 hours ago