Movie News

బామ్మర్దులు… లీకులు కాస్త చూసుకోండి

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ తో దర్శకుడు అనిల్ రావిపూడి తీస్తున్న జనవరి 12 విడుదల షూటింగ్ యమవేగంగా జరుగుతోంది. ఆదర్శ కుటుంబం ఏకె 47 రిలీజ్ వాయిదా పడినా సరే దాంతో తమకేం సంబంధం అన్న రీతిలో టీమ్ చక్కని ప్లానింగ్ తో దూసుకెళ్ళిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి పండగను మిస్ కాకూడదనే అనిల్ సంకల్పానికి తగ్గట్టే హీరోల సహకారం, నిర్మాత కో ఆపరేషన్ ఉండటంతో నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతోంది.

తాజాగా మైసూర్ షెడ్యూల్ లో తీస్తున్నట్టుగా చెప్పబడుతున్న ఒక పాట తాలూకు విజువల్స్ వీడియో రూపంలో బయటికి రావడం అభిమానులను టెన్షన్ పెట్టేసింది. మెయిన్ క్యాస్టింగ్ అంతా పాల్గొన్న ఈ సాంగ్ ఏదో గుడిలో హుషారైన సందర్భంలో వస్తున్నట్టుగా ఉంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్, కృతి శెట్టి, కీర్తి సురేష్ తో పాటు రఘుబాబు లాంటి సీనియర్ ఆర్టిస్టులు అందులో కనిపించారు. ఆడియో పెద్దగా వినిపించలేదు కానీ మంచి ఫోన్ కెమెరాతో తీయడం వల్ల విజువల్స్ స్పష్టంగానే వచ్చాయి.

ఇలాంటివి చూసి అనిల్ రావిపూడి ఖంగారు పడిపోయే రకం కాదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. పబ్లిక్ ప్లేసులో తీస్తున్నప్పుడు అందరికీ ఇదే సమస్య. దూరం నుంచి సెల్ ఫోన్ తో వీడియోని తీస్తున్న వాళ్ళను నియంత్రించడం దాదాపు అసాధ్యం. సోషల్ మీడియాలో ఒక క్లిప్ బయటికి వచ్చాక దాన్ని తీసేసేలోపు లక్షలాది మందికి చేరిపోతోంది. సరే పాట క్లిప్ కాబట్టి పర్వాలేదనుకున్నా ఏదైనా ముఖ్యమైన ఎపిసోడ్ అయితే చాలా ఇబ్బంది.

దీని సంగతలా ఉంచితే సంక్రాంతి సినిమాల్లోకెల్లా యమా ఫాస్ట్ గా ఉన్నది జనవరి 12 విడుదలనే. ఇంకో యాభై రోజుల్లో గుమ్మడి కాయ కొట్టేస్తారని టాక్. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కు తగినంత సమయం ఉండేలా రావిపూడి పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ తో ముందే పాటలు చేయించుకోవడం చాలా ప్లస్ అయ్యిందని అంటున్నారు. కాంపిటీషన్ ఎంత ఉన్నా ప్రతిసారి తన డామినేషన్ చూపిస్తున్న అనిల్ ఈసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నవ్వులు పంచబోతున్నారు. 

This post was last modified on September 5, 2026 7:34 am

Share

Recent Posts

బిగ్ స్టార్ రిలీజ్ లేదు… స్క్రీన్లకు మాత్రం పోటీ!

పండగ సీజన్ కాదు. తెలుగు నుంచి పెద్ద స్టార్ హీరో సినిమా కూడా లేదు. అయినా సెప్టెంబర్ రెండో వారంలో…

25 minutes ago

సుహాస్ & సూరి… చావో రేవో తేలిపోవాలి

టాలెంట్ ఉన్నప్పటికీ సక్సెస్ విషయంలో యుద్ధం చేసినట్టుగా పోరాడుతున్న సుహాస్ ఇప్పుడు కోలీవుడ్ లో అడుగు పెట్టాడు. భారీ బడ్జెట్…

31 minutes ago

క్రీడా కోటా నియామకంపై విచారణ

కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్‌ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్‌ ఎస్‌జీటీ (తెలుగు)గా…

60 minutes ago

సహకారం నిజంగా అందలేదా

నిన్న విడుదలైన చిన్న సినిమాల్లో కాస్త జనాల దృష్టిలో పడ్డ వాటిలో సహ కూడా ఉంది. మూవీ నచ్చకపోతే అమీర్…

1 hour ago

తెలంగాణాలో ఇది మూడో బర్తరఫ్

తెలంగాణాలో కొండా సురేఖ నుమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం, తదుపరి పరిణామాల గురించి హాట్ హాట్ గా చర్చలు…

2 hours ago

గాయం మీద కారం చల్లిన కొత్త టాక్సిక్

కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల ఫలితాలు చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత గుర్తుకొస్తుంది. గత వారం విడుదలైన…

3 hours ago