క‌ల్కి-2 ఇప్పట్లో అయ్యేది కాదు

ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో క‌ల్కి-2 ఒక‌టి. 2024లో విడుద‌లైన క‌ల్కి మూవీ ఎంత పెద్ద హిట్ట‌యిందో తెలిసిందే. వ‌ర‌ల్డ్ వైడ్ రూ.1200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ప్ర‌భాస్ అభిమానుల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సామాన్య ప్రేక్ష‌కులూ అమితాస‌క్తితో ఎదురు చూస్తున్నారు.
కానీ ప్ర‌భాస్ చేతిలో చాలా సినిమాలుండ‌డం.. వేరే క‌మిట్మెంట్ల వ‌ల్ల‌ త‌న కాల్ షీట్స్ దొర‌క‌డం క‌ష్టంగా మార‌డంతో క‌ల్కి-2 కోసం మిగ‌తా టీం అంతా రెడీగా ఉన్నా.. షూట్ అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌ట్లేదు.

ప్ర‌భాస్ అయితే ఈ సినిమా సెట్లో అడుగు పెట్ట‌లేద‌న్న‌ది స్ప‌ష్టం. మ‌రి అత‌ను లేకుండా ఎంత‌మాత్రం షూటింగ్ చేశారన్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే. ఐతే ఈ విష‌యంలో స్వ‌యంగా ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చేశాడు.
దుల్క‌ర్ స‌ల్మాన్ కొత్త సినిమా ఐమ్ గేమ్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజ‌రైన నాగికి.. యాంక‌ర్ సుమ నుంచి క‌ల్కి-2కు సంబంధించి ప్ర‌శ్న‌ల వ‌ర్షం ఎదురైంది. ఈ సినిమా షూట్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది.. ప్ర‌భాస్ షూట్‌కు వ‌చ్చాడా లేదా.. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్ పాత్ర ఉంటుందా లేదా అని ఫ్యాన్ అడుగుతున్న బ‌ర్నింగ్ క్వ‌శ్చ‌న్స్ అంటూ చెప్పుకొచ్చింది సుమ‌.

దానికి నాగ్ అశ్విన్ బ‌దులిస్తూ.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుంది అన్న‌ది త‌న‌కు కూడా బ‌ర్నింగ్ క్వ‌శ్చ‌నే అని చెప్పాడు. ఇప్ప‌టిదాకా క‌ల్కి సీక్వెల్‌కు సంబంధించి 10 రోజుల షూటింగ్ మాత్ర‌మే జ‌రిగింద‌ని.. ప్ర‌భాస్ అందుబాటులోకి వ‌స్తే ఒక లాంగ్ షెడ్యూల్ చేద్దామ‌ని ఎదురు చూస్తున్నామ‌ని నాగి తెలిపాడు.

ప్ర‌భాస్ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాడో త‌న‌కు తెలియ‌ద‌ని అత‌ను తేల్చేశాడు. గ‌తంలో క‌ల్కి షూట్ గురించి అడిగిన‌పుడు గ్ర‌హాలు క‌లిసి రావాల‌ని అన్న‌ట్లే.. ఇప్పుడు మరోసారి గ్ర‌హాల‌న్నీ ఒక లైన్లోకి వ‌చ్చిన‌పుడే క‌ల్కి-2 షూటింగ్ కూడా జ‌రుగుతుంద‌ని నాగి చ‌మ‌త్క‌రించాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స్పిరిట్ షూట్ నుంచి బ్రేక్ తీసుకుని.. ఫౌజి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అద‌య్యాక స్పిరిట్‌, క‌ల్కి-2 సినిమాల‌కు స‌మాంత‌రంగా ప‌ని చేయొచ్చ‌ని తెలుస్తోంది.