ఉప్పెన సినిమా టీజర్లో విలన్‍గా నటిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతిని అసలు చూపించలేదు. ఆ చిత్రానికి సంబంధించి అతనే పెద్ద ఆకర్షణ అయినా కానీ టీజర్లో మాత్రం అతడిని కావాలనే దాచిపెట్టారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి లుక్ ఎలా వుంటుందనేది లీక్ అయినా కానీ అతని మాట తీరు, వేషభాషలు ఏమిటనేది సీక్రెట్‍గా వుంచారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి కనికరం లేని విలన్‍గా కనిపిస్తాడట. తనని కాదని జాలరిని ప్రేమించిన కూతురికి గుణపాఠం చెప్పడానికి పీక్స్కి వెళ్లిపోయి హీరోను శిక్షిస్తాడట. ఎప్పుడూ విలన్ వేషాలు వేసే వాళ్లు కూడా ఇలాంటి పాత్ర పోషించడానికి జంకుతారని, అలాంటిది తమిళంలో అంత పెద్ద హీరో అయి వుండీ విలన్‍గా నటించడానికి ఓకే చెప్పాడని గొప్పగా చెప్పుకుంటున్నారు. సంక్రాంతికి విడుదలైన మాస్టర్ సినిమాలోను విజయ్ సేతుపతి విలన్‍గా కనిపించాడు.
హీరో కంటే కూడా అతనే హైలైట్ అయ్యాడు. ఒక రకంగా ఆ సినిమాను డిజాస్టర్ అయిపోకుండా అతడే కాపాడని కూడా చెప్పుకుంటున్నారు. అందులో చిన్న పిల్లలను కర్కశంగా చంపేసే వాడిగా కనిపించిన విజయ్ సేతుపతి ‘ఉప్పెన’లో అంత కంటే క్రూరుడిగా కనిపిస్తాడట. అందుకే అతడిని దాచి పెట్టి సినిమా రిలీజ్‍కి ముందు అంచనాలు పెంచే విధంగా స్పెషల్ ప్రోమోలు ప్లాన్ చేస్తున్నారట.
This post was last modified on January 15, 2021 11:53 pm
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…