Movie News

‘వకీల్ సాబ్’ కలరే మారిపోయిందిగా..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ మూవీగా ‘పింక్’ రీమేక్‌ను ఎంచుకోవడం అభిమానులకు ఎంతమాత్రం నచ్చలేదు. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో పవన్ చేసేదేముంది అనుకున్నారు. ఒరిజినల్లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రతో పోలిస్తే పవన్ పాత్రను పెంచినా సరే.. పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ నుంచి తాము ఆశించే అంశాలైతే ఇందులో ఉండవనే ఫిక్సయిపోయారు. ‘పింక్’ రీమేక్ కథాంశాన్ని బట్టి చూస్తే ఇలాంటి సీరియస్ సినిమాలో పవన్ మార్కు హీరో ఎలివేషన్లకు అంతగా ఛాన్స్ ఉండదనే అంతా అనుకున్నారు.

తమిళంలో అజిత్ లాంటి మాస్ హీరో ‘పింక్’ రీమేక్‌లో నటించగా.. ఆయన అభిమానులు ఆశించిన స్థాయిలో ఎలివేషన్లు లేకపోయాయి. వారు ఒకింత నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాల్లో కథను అనుసరించి వెళ్లిపోవాలి తప్ప హీరో ఎలివేషన్లు, మాస్ అంశాలు అంటే సినిమా చెడిపోతుందనే బలమైన అభిప్రాయం అందరిలోనూ ఉండిపోయింది.

కానీ తెలుగు రీమేక్‌కు చిత్ర బృందం ధైర్యం చేసి ‘వకీల్ సాబ్’ అనే హీరోను ఎలివేట్ చేసే టైటిల్ పెట్టింది. పవన్‌ను ఒక మాస్ సినిమాలో చూపించినట్లే ఫస్ట్ లుక్ డిజైన్ చేసింది. దీంతో ఒక్కసారిగా ‘వకీల్ సాబ్’ను చూసే దృష్టే మారిపోయింది. మధ్యలో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్లోనూ పవన్ మాత్రమే హైలైట్ అయ్యాడు. అభిమానులను అలరించేలా కనిపించాడు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్‌తో ‘వకీల్ సాబ్’ కలరే మారిపోయినట్లు అయింది. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోయింది.

ఒరిజినల్లో అత్యంత కీలక పాత్రలుగా ఉన్న ముగ్గురు అమ్మాయిలు బ్యాక్ సీట్ తీసుకోబోతుండటం ఖాయం. వారి వరకు కథాంశం మారకపోయినా.. కథనాన్ని మార్చి, వారి పాత్రల నిడివిని కొంచెం తగ్గించబోతున్నారన్నది స్పష్టం. అలాగే పవన్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్.. వర్తమానంలో ఎలివేషన్ సీన్లు, ఫైట్లు ఇవన్నీ తోడవబోతున్నాయి. దీని వల్ల ఓవరాల్‌గా సినిమా నిడివి పెరగబోతోంది. మొత్తంగా ఒక బలమైన కథాంశాన్ని కమర్షియల్ స్టయిల్లో చెప్పే ప్రయత్నం చేయనున్నాడన్నమాట దర్శకుడు వేణు శ్రీరామ్. ఐతే మార్పులు, చేర్పుల వల్ల సినిమా ఏమీ దెబ్బ తినకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి టీజర్ వరకు చూస్తే. ఇవన్నీ వర్కవుట్ అయితే.. ‘గబ్బర్ సింగ్’ స్టయిల్లోనే ఇది కూడా మంచి విజయాన్నందుకునే అవకాశాలున్నాయి.

This post was last modified on January 15, 2021 6:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

19 minutes ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

54 minutes ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

3 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

10 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

11 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

12 hours ago