Movie News

కన్నడిగుల ఆక్రోశం అర్థరహితం

సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో ఎన్నో వందల ఉదాహరణలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులంత విశాల హృదయులు దేశంలో ఇంకెవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పర భాషా కథానాయకులను కూడా ఇక్కడి వాళ్ల తరహాలో ఆదరించడం.. భారీ వసూళ్లు అందించడం మన వాళ్లకే సాధ్యం.

రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, ఉపేంద్ర, యశ్, రిషబ్ శెట్టి, మమ్ముట్టి, మోహన్ లాల్, టొవినో థామస్, ఫాహద్ ఫాజిల్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్.. ఇలా ఎంతోమంది ఇతర భాషా కథానాయకులకు ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్లందరి సినిమాలూ ఇక్కడ బాగా ఆడాయి. తెలుగు ప్రేక్షకుల గొప్పదనమేంటో ఇతర ఇండస్ట్రీల వాళ్లకు బాగా తెలుసు. కంటెంట్ ఉంటే నెత్తిన పెట్టుకుంటారన్నది స్పష్టం. కానీ కంటెంట్ మరీ వీక్‌గా ఉన్న ‘టాక్సిక్’ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు పెదవి విరిచారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగిన మాట వాస్తవం.

ఐతే సినిమా మరీ పేలవంగా ఉంటే.. అది తెలుగు చిత్రం అయినా సరే ట్రోల్ చేయడం మన వాళ్లకు అలవాటే. కానీ ఏదో కన్నడ సినిమానే టార్గెట్ చేస్తున్నట్లుగా యశ్ ఫ్యాన్స్ నిన్నట్నుంచి తెలుగు ప్రేక్షకుల మీద విరుచుకుపడిపోతున్నారు. ఐతే వారు ఆగ్రహించడంతో సరిపెట్టడం లేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద ఎగతాళిగా పోస్టులు పెడుతున్నారు. మన వాళ్లకు ఐటెం సాంగ్స్ ఉంటే ఇష్టమని.. రొటీన్, క్రింజ్ స్టోరీలనే ఆదరిస్తారని.. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేను అర్థం చేసుకోలేరని.. ఇలా రకరకాల కామెంట్లతో మన వాళ్లను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

ఐతే ‘టాక్సిస్’ సినిమాలో ఏమాత్రం విషయం ఉందో కన్నడిగులకు కూడా తెలియంది కాదు. దేశవ్యాప్తంగా అన్ని భాషల నుంచి రివ్యూలు నెగెటివ్‌గానే వచ్చాయి. అక్కడికేదో తెలుగు వాళ్లు మాత్రమే ఈ సినిమాను టార్గెట్ చేస్తున్నట్లు కన్నడిగులు సెటైర్లు వేయడం విడ్డూరం. ఇదే తెలుగు ప్రేక్షకులకు అనామకుడైన యశ్‌ను ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ సినిమాలు రిలీజైనపుడు ఎలా సెలబ్రేట్ చేశారో తెలియదా? ‘టాక్సిక్’కు సైతం ఎంత భారీ ఓపెనింగ్ ఇచ్చారో అర్థం కాలేదా? యశ్‌తో పాటు ఉపేంద్ర, కిచ్చా సుదీప్, రిషబ్ శెట్టిలను ఎంతగా ఆదరించారో కొత్తగా గుర్తు చేయాలా? ఇవేమీ పట్టించుకోకుండా ‘టాక్సిక్’ సినిమాను విమర్శించారని వారి మీద దాడి చేయడం టూమచ్.

This post was last modified on August 28, 2026 6:20 pm

Share

Recent Posts

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

6 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

36 minutes ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago