ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగులో అయితే అతడికి ఎదురే లేదు. ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్‌ను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకుని చాలా కాలమైంది. ‘వకీల్ సాబ్’తో పాటు పవన్ కళ్యాణ్ నటించనున్న మరో సినిమా (అయ్యప్పనుం కోషీయుం రీమేక్).. అలాగే మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’.. ఇలాంటి భారీ చిత్రాలు తమన్ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతానికి వీటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది ‘వకీల్ సాబ్’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది మహిళల నేపథ్యంలో సాగే సినిమా కదా.. తమన్ ప్రత్యేకత ఏముంటుందిలే అనుకున్నారు కానీ.. ఇందులో హీరోయిజానికి, ఎలివేషన్ సీన్లకు లోటేమీ ఉండదని ఇప్పటిదాకా వచ్చిన ప్రోమోలు రుజువు చేశాయి. ముఖ్యంగా లేటెస్టుగా వచ్చిన టీజర్ అయితే పవన్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేసింది.
తమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఈ టీజర్‌ను ఎలివేట్ చేశాడు. పవన్ తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటే.. దర్శకుడు వేణు శ్రీరామ్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా పవర్ స్టార్‌ను ప్రెజెంట్ చేశాడు. తమన్ తన వంతుగా ఆర్ఆర్‌తో టీజర్‌ను ఎలివేట్ చేశాడు. ఐతే తమన్ ఎంత పనితనం చూపించినా.. కాపీ కోణంలో చూడటం జనాలకు అలవాటు. గతంలో అతడి ట్యూన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌ల విషయంలో మరకలు పడటమే అందుక్కారణం.
‘వకీల్ సాబ్’ టీజర్ స్కోర్‌ను సైతం ఇప్పుడు ‘మాస్టర్’ టీజర్‌తో పోల్చి చూస్తున్నారు. అనిరుధ్ ‘మాస్టర్’ టీజర్‌కు ఇచ్చిన స్కోర్‌ను తమన్ కాపీ కొట్టేశాడు అనలేం కానీ.. ఆ స్టయిల్‌ను ఫాలో అయినట్లు అనిపిస్తుంది రెండు టీజర్లను మార్చి మార్చి చూస్తే. ఇక చివర్లో వచ్చే విజిల్ సౌండ్ కూడా కొన్ని సినిమాల్లో విన్నదే. పవన్ టీజర్లో బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా ఎంత ఊపు ఉండాలో అంతా ఉన్నప్పటికీ.. తమన్ కొత్తగా చేసిందేమీ లేదని.. వేరే సినిమాల ఆర్ఆర్ స్టైల్‌ను ఫాలో అయ్యాడనే విమర్శలు మాత్రం తప్పట్లేదు.
This post was last modified on January 15, 2021 3:53 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…