సంక్రాంతి సందర్భంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’ టీజర్. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో టీజర్ ఉండటంతో రెస్పాన్స్ అదిరిపోతోంది. యూట్యూబ్‌లో వ్యూస్, లైక్స్ పరంగా తెలుగు టీజర్ల రికార్డులను సవరిస్తూ సాగిపోతోందీ టీజర్. నిమిషం పైగా నిడివి ఉన్న టీజర్లో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే సూపర్ స్టైలిష్‌గా, పవర్ ఫుల్‌గా కనిపించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. అభిమానుల వరకు ‘వకీల్ సాబ్’ టీజర్ సూపర్ అనడంలో మరో మాట లేదు.
ఐతే అదే సమయంలో ఈ టీజర్ విషయమై కొన్ని అభ్యంతరాలు, విమర్శలు తప్పట్లేదు. ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇది మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ రూం డ్రామా అన్న సంగతి తెలిసిందే. కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. అమితాబ్ బచ్చన్ వారి కథలో అతిథిలా కనిపిస్తాడు.
ఐతే తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసినపుడు అమితాబ్ స్థానంలోకి అజిత్ రావడంతో ఆయన పాత్రను బాగా ఎలివేట్ చేశారు. ఇక తెలుగులోకి వచ్చేసరికి పూర్తిగా ముగ్గురు లేడీస్ పాత్రల్ని పక్కకు నెట్టేసి పవన్‌నే హైలైట్ చేస్తున్నారన్న విమర్శ ముందు నుంచి ఉంది.
ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లో ఇప్పటికే లేడీ క్యారెక్టర్లకు స్థానం లేకుండా చేశాడు. ఇప్పుడు టీజర్ కూడా పూర్తిగా పవన్ మీదే నడవడంపై ఫెమినిస్టులు.. ‘పింక్’ను ఇష్టపడ్డ వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాత్రానికి ‘పింక్’ను రీమేక్ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
లేడీ క్యారెక్టర్లను టీజర్లో చూపించలేదన్న వారికి.. రెప్పపాటులో బ్యాగ్రౌండ్లో అలా మెరిసి మాయమైనట్లుగా అంజలి, నివేథా థామస్ కనిపించిన స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నారు కానీ.. అక్కడ వాళ్లు ఉన్నా లేనట్లే ఉంది. దీనిపై ఓ వర్గం విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కానీ.. ఒక రీమేక్ సినిమాను ఇలాగే తీయాలని రూల్ ఏమైనా ఉందా.. ఎవరిష్టం వాళ్లది అంటూ మరో వర్గం వాదిస్తోంది.
This post was last modified on January 15, 2021 1:08 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…