Movie News

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు హిందీలోకి డ‌బ్ అవ‌డం, ఆద‌ర‌ణ పొంద‌డం అరుదు. కానీ బాహుబ‌లి త‌ర్వాత క‌థ మారిపోయింది. తెలుగు సినిమాలు చాలానే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ‌వుతున్నాయి. అప్పుడ‌ప్పుడూ కొన్ని సినిమాలు నార్త్ ఇండియాలో వ‌సూళ్ల మోత మోగిస్తున్నాయి.

దీనికి తోడు తెలుగు సినిమాల‌ను డ‌బ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌, రామ్ పోతినేని లాంటి వాళ్లు హిందీలో నేరుగా సినిమాలు చేయ‌క‌పోయినా.. ఉత్త‌రాదిన రూర‌ల్ ఏరియాల్లో కూడా పాపులారిటీ సంపాదించారంటే వారి హిందీ డ‌బ్బింగ్ సినిమాల వ‌ల్లే. 

శ్రీనివాస్ మూవీ జ‌య జాన‌కి నాయ‌క ఏకంగా 100 కోట్ల వ్యూస్‌తో రికార్డు కూడా నెల‌కొల్ప‌డం విశేషం. ఐతే యూట్యూబ్‌లో తెలుగు అనువాద చిత్రాల‌కు ఇంత ఆద‌ర‌ణ ద‌క్క‌డానికి పునాది వేసిన ఘ‌న‌త అక్కినేని నాగార్జున సొంతం అంటే అతిశ‌యోక్తి కాదు. యూట్యూబ్ ఊపందుకోవ‌డానికంటే ముందు నాగ్ సినిమాలు మాస్, డాన్ హిందీ ఛానెల్ సోనీ మ్యాక్స్‌లో విప‌రీత‌మైన ఆద‌ర‌ణ సంపాదించాయి. ఆ త‌ర్వాత అవి యూట్యూబ్‌లోనూ భారీగా వ్యూస్ తెచ్చుకున్నాయి.

ఐతే ఈ ట్రెండును అక్కినేని నాగార్జున కూడా గుర్తించారు. తాజాగా త‌న కొడుకులిద్ద‌రితో క‌లిసి ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో హిందీలో తెలుగు అనువాద చిత్రాల ప్ర‌భావం గురించి ఆయ‌న మాట్లాడారు. తాను 90వ ద‌శ‌కంలోనే శివ‌, ఖుదాగ‌వా, క్రిమిన‌ల్ లాంటి స్ట్రెయిట్ హిందీ చిత్రాల్లో న‌టించాన‌ని.. కానీ వాటితో వ‌చ్చిన గుర్తింపు కంటే సోనీ మ్యాక్స్‌లో మాస్ డ‌బ్బింగ్ వెర్ష‌న్ మేరి జంగ్‌తో వ‌చ్చిన పాపులారిటీనే ఎక్కువ అని నాగ్ చెప్పాడు. 

అలాగే డాన్ మూవీని డాన్ నంబ‌ర్ 1గా డ‌బ్ చేసి రిలీజ్ చేస్తే అది కూడా అపూర్వ‌మైన ఆద‌ర‌ణ ద‌క్కించుకుంద‌ని నాగ్ తెలిపాడు. తాను ఎప్పుడైనా ఢిల్లీకో, ఇంకో నార్త్ సిటీకో వెళ్తే త‌న ద‌గ్గ‌ర నార్త్ ఫ్యాన్స్ ఈ సినిమాల గురించే ప్ర‌స్తావిస్తార‌ని.. ఉత్త‌రాదిన చిన్న చిన్న టౌన్ల‌లో కూడా త‌న‌కు ఈ సినిమాలు గుర్తింపు తెచ్చాయ‌ని నాగ్ తెలిపాడు. హిందీలో తెలుగు డ‌బ్బింగ్ సినిమాల మార్కెట్ ఓపెన్ కావ‌డానికి ఈ సినిమాలే కార‌ణ‌మ‌ని నాగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

This post was last modified on August 22, 2026 11:13 pm

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

1 hour ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

4 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

6 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

11 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

12 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago