తమిళంలో హీరో ధనుష్, దర్శకుడు సెల్వ రాఘవన్‌లది తిరుగులేని కాంబినేషన్. ఈ అన్నదమ్ముల కలయికలో తుళ్లువదో ఎలమై (జూనియర్స్), కాదల్ కొండేన్ (నేను), పుదుప్పేట్టై (ధూల్ పేట), మయక్కం ఎన్న లాంటి క్లాసిక్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ ఒకరి అండతో ఒకరు ఎదిగి.. తిరుగులేని స్థాయిని అందుకున్న వాళ్లే. మళ్లీ ఈ బ్రదర్స్ కలయికలో ఓ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే వీరి కలయికలో ‘యుగానికి ఒక్కడు-2’ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సినిమా అనౌన్స్ చేస్తూ 2024లో రిలీజ్ అని పోస్టర్ మీద వేయడమేంటో జనాలకు అర్థం కాలేదు. అంత టైం ఎందుకు అన్న సందేహం కలిగింది. ఐతే ఈ అన్నదమ్ములు ‘యుగానికి ఒక్కడు-2’ లాంటి భారీ చిత్రం చేయడానికి ముందు వేరే సినిమాతో పలకరించబోతున్నారు. సడెన్ సర్ప్రైజ్ అన్నట్లుగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
‘నానే వరువేన్’.. ఇదీ ధనుష్-సెల్వ కలయికలో రాబోతున్న కొత్త చిత్రం పేరు. సెల్వతో ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే రెగ్యులర్.. మోడర్న్ లుక్‌లో కనిపిస్తున్నాడు ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో. సిటీ నేపథ్యంలో ఒక మామూలు కమర్షియల్ సినిమానే తీయబోతున్నాడనిపిస్తోంది సెల్వ ఈసారి. అతడి సినిమాల్లో మామూలుగా కనిపించే వైవిధ్యం అయితే పోస్టర్లో కనిపించలేదు.
కొన్నేళ్లుగా సెల్వ నుంచి అతడి స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు. చివరగా సూర్యతో చేసిన ‘ఎన్జీకే’ చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది. తమిళంలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. మరోవైపు సూర్యతో చేసిన ఓ సినిమా విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో నేరుగా ‘యుగానికి ఒక్కడు-2’ లాంటి భారీ చిత్రం చేయడం కంటే ముందు.. తాను ఫామ్‌లోకి రావడానికి తమ్ముడితోనే మరో సినిమా చేస్తున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on January 14, 2021 12:15 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…