విశ్వనాథ్ కాళ్లకు ఇరుముడి బంధనం

తమిళం కంటే తెలుగులోనే బాగా పెర్ఫార్మ్ చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ కు రెండో వారం చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఆగస్ట్ 26 టాక్సిక్ వస్తున్న నేపథ్యంలో ఆలోగా వీలైనంత రాబట్టుకునే ప్లాన్ లో ఉంది. దానికి రాబోయే వీకెండ్ ముఖ్యం. అయితే దానికన్నా ముందు ఇరుముడి రూపంలో విశ్వనాథ్ కాళ్లకు పెద్ద బంధనం అడ్డు తగిలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దానికున్న ప్రీ పాజిటివ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి.

ఒకవేళ టాక్ బాగా వస్తే మాత్రం రవితేజ బాక్సాఫీస్ ని అల్లేస్తాడు. గతంలో సంక్రాంతికి మంచి కాంపిటీషన్ ఉన్న టైంలో క్రాక్ రూపంలో బ్లాక్ బస్టర్ కొట్టిన ట్రాక్ రికార్డు ఉంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి పండగ పోటీ వల్లే వసూళ్లు తగ్గించుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయం ఇప్పటికీ ఫ్యాన్స్ లో ఉంది. సో ఇరుముడికి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. సోలోగా దిగుతోంది. ప్రమోషన్లు బాగా చేయడంతో ఆడియన్స్ దాకా సినిమా రీచయ్యింది. అందుకే ఓపెనింగ్స్ బాగా రాబోతున్నాయి.

నిర్మాణ సంస్థ చెప్పుకున్న దాని ప్రకారం విశ్వనాధ్ అండ్ సన్స్ నిజంగా నూటా యాభై కోట్లు దాటిందా లేదానే దాని మీద ఇండస్ట్రీ వర్గాల్లోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎంతో కొంత కలుపుకోవడం అందరూ చేసేదేనని స్వయంగా నిర్మాత నాగవంశీ గతంలో చెప్పిన ఉదంతాన్నే ఇప్పుడు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ మూవీ నెక్స్ట్ టార్గెట్ రెండు వందల కోట్లు. ఇది చేరుకోవాలంటే ఏపీ తెలంగాణ వసూళ్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

ఇరుముడికున్న పెద్ద అడ్వాంటేజ్ మాస్ జనాలను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటం. అయ్యప్పస్వామి మాల మీద రెండు పాటలు పెట్టారు కానీ ఇదేమి డివోషనల్ జానర్ కాదు. పక్కా కమర్షియల్ బొమ్మ. రివెంజ్ డ్రామాతో పాటు క్రైమ్ యాంగిల్ పెట్టారు. కూతురి సెంటిమెంట్ స్పెషల్ బోనస్. మాలలో హుందాగా కనిపించే రవితేజతో పాటు మందు కొట్టి బండి నడిపే మాస్ రాజాని కూడా చూడొచ్చు. సో విశ్వనాథ్ కు తను ఎంత ప్రతిబంధకం అవుతాడనేది రేపు తేలుతుంది.