‘అల వైకుంఠపురములో’ సినిమా అల్లు అర్జున్‌కు మామూలు కిక్కు ఇచ్చినట్లు లేదు. లేక లేక ఇండస్ట్రీ హిట్ (నాన్ బాహుబలి) కొట్టేసరికి అతను ఎంతగా పరవశించిపోతున్నాడో ఏడాది నుంచి చూస్తూనే ఉన్నాం. గత ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజయ్యాక మొదలైన సంబరాలు ఏడాది తర్వాత కూడా కొనసాగాయి.
మొన్ననే రీ యూనియన్ పేరుతో ‘అల వైకుంఠపురములో’ టీం పెద్ద వేడుక చేసుకుంది. ఆ సందర్భంగా ఇండస్ట్రీ మిగతా స్టార్లకు ఎప్పుడు ఇండస్ట్రీ హిట్ వచ్చిందో గుర్తు చేస్తూ.. తాను చాలా ఆలస్యంగా ఆ ఘనత అందుకున్న విషయాన్ని చెప్పుకొచ్చాడు బన్నీ. ఐతే ఆ మాట అన్నాక ఇది తన తొలి అడుగు మాత్రమే అని.. తర్వాత ఏంటి అన్నది మాటల్లో కాకుండా యాక్షన్లో చూపిస్తానని బన్నీ అనడం అతడి అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహాన్నిచ్చింది. అసలు కథ ముందుంది అన్నట్లుగా అతను సంకేతాలు ఇచ్చాడు.
బన్నీ ఇంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడటానికి సుకుమార్ ఇచ్చిన కిక్కే కారణం అన్నది ‘పుష్ప’ చిత్ర వర్గాల మాట. ఈ సినిమా కథ తెలిసిన వాళ్లు.. స్క్రిప్టు మీద ఐడియా ఉన్నవాళ్లు.. అలాగే ఇప్పటిదాకా జరిగిన సన్నివేశాల తాలూకు రష్ చూసిన వాళ్లు చెబుతున్న మాట ఏంటంటే.. బన్నీ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమట. అసలే సుకుమార్ ‘రంగస్థలం’ లాంటి ఆల్ టైం హిట్ తీసిన ఊపులో ఉన్నాడు. పైగా ‘పుష్ప’ కోసం విపరీతమైన కసరత్తు చేశాడు. మరోవైపు బన్నీ ‘అల..’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. దీంతో ‘పుష్ప’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ‘పుష్ప’ ఉంటుందని.. రగ్డ్ లుక్‌లో బన్నీ విశ్వరూపం చూపించబోతున్నాడని.. ఇంటర్వెల్ బ్లాక్ సహా కొన్ని ఎపిసోడ్లకు గూస్ బంప్స్ గ్యారెంట ీఅని.. సినిమా సంచలన విజయం సాధించడం ఖాయమని చాలా ధీమాగా చెబుతున్నారు యూనిట్ సభ్యులు.
దీని తర్వాత కొరటాల శివతో జట్టు కట్టనుండటం.. ఆ తర్వాత కుదిరితే రాజమౌళితో సినిమా చేయాలని బన్నీ ఆశిస్తుండటం.. ఈ నేపథ్యంలోనే తనేంటో మున్ముందు చూస్తారని బన్నీ ధీమా వ్యక్తం చేసినట్లు అర్థమవుతోంది.
This post was last modified on January 13, 2021 10:28 pm
కల్కి 2898 ఏడిలో హీరోయిన్ గా కనిపించేది ఎక్కువసేపు కాకపోయినా ప్రాధాన్యం దక్కించుకున్న దీపికా పదుకునే రెండో భాగంలో ఉంటుందో…
కింగ్ డమ్ కోసం ముందు అనుకున్న జూలై 4 త్యాగం చేసిన తమ్ముడు కొత్త విడుదల తేదీ జూలై 25…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…
జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత ఆ స్థాయి ఫాంటసీ మూవీగా అంచనాలు మోస్తున్న విశ్వంభర వ్యవహారం ఎంతకీ తెగక, విడుదల తేదీ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు భారీ మేలును…
ఏపీలోని అధికార కూటమి రథసారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ) ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడులో ఎలాంటి మార్పులు…