సంక్రాంతికి ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలదే హవా. ఒకప్పుడైతే తమిళ డబ్బింగ్ సినిమాలేవీ పండక్కి రిలీజయ్యేివి కావు. కానీ కొన్నేళ్లుగా అవి కూడా ప్రతిసారీ సంక్రాంతి రేసులో నిలుస్తున్నాయి. సూర్య సినిమా ‘గ్యాంగ్’, ఆ తర్వాత రజినీకాంత్ చిత్రాలు ‘పేట’; ‘దర్బార్’ సంక్రాంతికే రేసులో నిలిచాయి. ఐతే అవి చూపిన ప్రభావం అంతంతమాత్రం. తెలుగు సినిమాల జోరు ముందు అవి ఏమాత్రం నిలవలేకపోయాయి.
మామూలుగా సంక్రాంతి అంటే తెలుగులో బడా హీరోలు నటించిన భారీ చిత్రాలు పోటీలో ఉంటాయి కాబట్టి.. వాటి ముందు తమిళ అనువాదాలు నిలిచేవి కావు. కానీ ఈసారి మాత్రం కథ మారింది. సంక్రాంతికి ఎన్నడూ లేని విధంగా ఒక తమిళ అనువాద చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఆధిపత్యాన్ని చాటబోతోంది. బుధవారం విడుదల కానున్న విజయ్ సినిమా ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న అనూహ్య క్రేజ్ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
సంక్రాంతి బరిలో ఉన్న మూడు తెలుగు సినిమాలకు లేని విధంగా ‘మాస్టర్’కు తెల్లవారుజామున, ఉదయం షోలు పెద్ద సంఖ్యలో వేస్తున్నారు. సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన ‘క్రాక్’కు దీటుగా ‘మాస్టర్’కు స్క్రీన్లు దక్కాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జరిగాయి. బుక్ మై షోలో ఎటు చూసినా సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ మెసేజ్‌లే కనిపిస్తున్నాయి. ముందుగా సోలోగా రిలీజ్ కావడం వల్ల ‘క్రాక్’ సేఫ్ అయిపోయింది కానీ.. ‘మాస్టర్’ దెబ్బకు తర్వాతి రోజు రానున్న ‘రెడ్’; ‘అల్లుడు అదుర్స్’ సినిమాల ఓపెనింగ్స్‌కు గట్టి దెబ్బ పడేలా కనిపిస్తోంది.
ఆ రెంటితో పోలిస్తే ‘మాస్టర్’కే క్రేజ్ ఎక్కువగా ఉందంటే అతిశయోక్తి కాదు. తొలి రోజు ఓపెనింగ్స్ విషయంలోనూ అదే ఆధిపత్యాన్ని చాటేలా ఉంది. ‘క్రాక్’కు దీటుగా, ఇంకా మించి కూడా ఓపెనింగ్స్ వచ్చినా ఆశ్చర్యం లేదేమో. ‘మాస్టర్’కు పాజిటివ్ టాక్ వస్తే ఓ తమిళ అనువాద చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచే అరుదైన సందర్భాన్ని చూడబోతున్నట్లే.
This post was last modified on January 13, 2021 12:42 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…