Political News

తెలంగాణపై బీజేపీ ఆశలు వదులుకుందా?

ఉత్తరాదిలో బలంగా పాతుకుపోయిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలని చాలాకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రయత్నాలు కర్ణాటకలో కొంతవరకు సఫలమైనప్పటికీ కేరళం, ఏపీ, తెలంగాణ, తమిళనాడులో మాత్రం విఫలప్రయత్నాలుగానే మిగిలాయి. కాస్తో కూస్తో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది అనుకున్న తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించారని, ఆ తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోయిందని టాక్. ఆ తర్వాత కిషన్ రెడ్డి పగ్గాలు చేపట్టినా..ఆ గ్రాఫ్ మరింత దిగజారిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ చేయడం వృథా అని బీజేపీ అధిష్టానం అనుకున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా బీజేపీ ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ప్రాతినిధ్యం దక్కకపోవడమే అందుకు నిదర్శనం. గతంలో కీలక పదవులు నిర్వహించిన టీబీజేపీ నేతలకు ఈసారి బీజేపీ హై కమాండ్ మొండి చేయి చూపించడం చర్చనీయాంశమైంది. గతంలో డీకే అరుణ, బండి సంజయ్, కె.లక్ష్మణ్ తదితరులు జాతీయ కార్యవర్గ జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ ఈ సారి మాత్రం బీజేపీ పెద్దలు తెలంగాణ బీజేపీ నేతలకు రిక్త హస్తాలు చూపించారు.

తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ జాతీయ కార్యవర్గ నియామకాల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం లభించకపోవడం శోచనీయం. మరోవైపు, బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డి సత్సంబంధాలు నెరపుతున్నారని, ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగినా ఆశ్చర్యపోనవరసరం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో పలు రాష్ట్రాలలోని కీలక నేతలను తమవైపుకు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టిన నేపథ్యం బీజేపీకి ఉంది. ఇటువంటి పలు ప్రచారాల నేపథ్యంలోనే తెలంగాణపై బీజేపీ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది.

This post was last modified on August 17, 2026 8:20 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago