Movie News

బ్రేకప్ వివాదంపై స్పందించిన ధృవ్ విక్రమ్?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ సినీ న‌టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తోంది. త‌న పాస్ట్ ల‌వ్ స్టోరీ గురించి ఆమె సంచ‌ల‌న విష‌యాలు వెల్లడించింది. త‌న ఎక్స్ ల‌వ‌ర్ వ‌ల్ల మాన‌సిక క్షోభ అనుభవించిన‌ట్లు ఆమె చెబుతోంది. అత‌ణ్ని అప‌రిచితుడు క్యారెక్ట‌ర్‌తో పోల్చింది. త‌న వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లూ ఎదుర్కొన్నాన‌ని.. ట్రామా అనుభ‌వించాన‌ని ఆమె ఒక ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

ఎక్క‌డా అనుప‌మ ఆ వ్య‌క్తి పేరు ప్ర‌స్తావించ‌క‌పోయినా.. ఆమె బైస‌న్ సినిమాలో న‌టిస్తున్న స‌మ‌యంలో ధ్రువ్ విక్ర‌మ్‌తో ప్రేమ‌లో ప‌డి, రెండేళ్ల పాటు త‌న‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉంద‌న్న అనుమానం అందరికీ ఉంది. ఈ నేప‌థ్యంలో ధ్రువ్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎటాక్ జ‌రుగుతోంది.

దీంతో అనుప‌మ వ్యాఖ్య‌లు, ఆరోప‌ణ‌లపై ధ్రువ్ స్పంద‌న కోసం.. త‌న వెర్ష‌న్ కోసం అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇండియా టుడే నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ కార్య‌క్ర‌మంలో అత‌ను పాల్గొనగా.. అక్క‌డ అత‌ను త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన వివాదం గురించి న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడాడు. యాంక‌ర్ కూడా సూటిగా వివాదం గురించి ప్ర‌స్తావించ‌కుండా, సోష‌ల్ మీడియాలో నిరంత‌రం జ‌రిగే స్క్రుటినీ గురించి మీ అభిప్రాయం ఏంటి అని ధ్రువ్‌ను అడిగింది. 

దీనిపై అత‌ను స్పందిస్తూ.. ”ఈ ప‌ని నుంచి నేను త్వ‌ర‌గా నిష్క్ర‌మించిన‌పుడే స్క్రుటినీ ఉంటుంద‌ని అంచ‌నా వేశా. ఇది న‌న్ను ప్ర‌భావితం చేయ‌లేద‌ని చెప్ప‌ను. మ‌నం ప్రేమించేవాళ్లంద‌రినీ కొంచెం బ‌లంగా ర‌క్షించే ప్ర‌య‌త్నం చేయాల్సిన అవ‌స‌ర‌ముంటుంది. మ‌నం నిజానికి క‌ట్టుబ‌డిన‌పుడు, మ‌న‌ల్ని న‌డిపించేది ఏంటో మ‌న‌కు తెలిసిన‌పుడు, ఈ స్క్రుటినీ అన్న‌ది నెమ్మ‌దిగా ప‌క్క‌కు వెళ్లిపోతుంది. నా ప్ర‌యాణంలో ఎప్పుడూ నాకు మ‌ద్ద‌తుగా నిలిచే వ్యక్తులు చాలామంది ఉన్నారు” అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా స‌మాధానం ఇచ్చాడు ధ్రువ్.

ఐతే వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి లోతుగా మాట్లాడే వేదిక కాదు కాబ‌ట్టి ధ్రువ్ ఇలా మాట్లాడి ఉండొచ్చు కానీ, భ‌విష్య‌త్తులో మీడియాకు ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన‌పుడు మాత్రం త‌న‌పై వచ్చిన ఆరోప‌ణ‌ల‌పై ధ్రువ్ సూటిగా స్పందించే అవ‌కాశ‌ముంది.

This post was last modified on August 17, 2026 8:03 pm

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

51 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

9 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

9 hours ago