చట్టసభలను గతంలో చాలామంది నేతలు దేవాలయాలుగా భావించేవారు. ప్రజల జీవితాలను మార్చగలిగే చట్టాలను చేసేందుకు తమకు అధికారం ఇచ్చారని జవాబుదారీతనంగా ఉండే నేతలు గతంలో చాలామంది ఉన్నారు. కానీ, కాలగమనంలో చట్టసభలు వన్నె కోల్పోయాయి.
చట్టసభలలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడం, వీలైతే వారి కుటుంబ సభ్యులను కూడా చట్టసభలకు లాగడం, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు వంటివి ఈ తరం రాజకీయ నాయకులలో చాలామందికి పరిపాటిగా మారిందంటే అతిశయోక్తి కాదు.
అయితే, పొరపాటున నోరు జారి ఆవేశంలో ఏదైనా మాట అంటే ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించాలని కోరిన నేతలు కూడా కొందరు ఉన్నారు. కానీ, తమ పార్టీకి చెందిన మంత్రి నోరు జారితే ఆయన తరఫున క్షమాపణలు చెప్పిన సభాపక్ష నేతలు మాత్రం చాలా అరుదు. ఆ అరుదైన జాబితాలో తమిళనాడు సీఎం విజయ్ తాజాగా చేరారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో సైతం ఇటువంటి నేతలున్నారు అని నిరూపించిన విజయ్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ సీఎం కరుణానిధి పేరుని అటవీశాఖ మంత్రి రంజిత్‌కుమార్ మర్యాద లేకుండా సంభోదించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై విపక్ష డీఎంకే సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలు చేసిన మంత్రి తరఫున డీఎంకే సభ్యులకు సీఎం విజయ్ సభలోనే బేషరతుగా క్షమాపణలు కోరారు.
తన మంత్రి చేసిన తప్పునకు సభాపతి సమక్షంలో అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని సీఎం విజయ్ ప్రకటించి ఆ వివాదానికి తెరదించారు. ఈ నేపథ్యంలోనే విజయ్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నవశకం రాజకీయాలలో ఈ తరహా మంచి సంస్కృతికి విజయ్ నాంది పలికారని, దేశంలోని ఎందరో రాజకీయ నాయకులకు విజయ్ ఆదర్శప్రాయమని కొనియాడుతున్నారు.
This post was last modified on August 17, 2026 8:17 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…