అతడో టాప్ హీరో. యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఎన్నో చేశాడు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాను సహజీవనం చేస్తున్న హీరోయిన్ కు అశ్లీల మెసేజ్ పంపించాడన్నా ఒకే ఒక్క కారణంతో అభిమానినే దారుణంగా హత్య చేశాడు. అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి మరీ చంపాడు. ఇదిప్రముఖ కన్నడ హీరో దర్శన్ కథ. కథ కాదు కేసు. ఇంతకూ ఏమి జరిగిందంటే…
కన్నడ సినిమా రంగంలో టాప్ హీరోల్లో ఒక్కడైన దర్శన్ కు పవిత్ర గౌడ అనే హీరోయిన్ తో సన్నిహిత సంబంధం ఉంది. గత కొంతకాలంగా ఇద్దరూ సహాజీవనం చేస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన ఎం. రేణుస్వామికి దర్శన్ అంటే చచ్చేంత అభిమానం. ఒక ఆసుపత్రిలో బిల్లింగ్ క్లర్క్ గా పనిచేసే రేణుస్వామి హీరో యిన్ పవిత్రా గౌడ ఇన్ స్టా కు అసభ్యకరమైన మెసేజ్ లు పంపించాడు. ఈ విషయం హీరో దర్శన్ కు తెలిసింది. ఆగ్రహానికి గురైన దర్శన్ తన అనుచరులను పంపించి రేణుస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకొచ్చారు. తీవ్రంగా చిత్రహింసలు పెట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సుమనహళ్లి దగ్గర డ్రైనేజి లో పడేసారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ హత్య కన్నడ సినిమా రంగాన్ని కుదిపేసింది.
ఇటీవల కాలంలో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. రేణు స్వామి మృత దేహాన్ని గుట్టుగా తరలించడానికి, సాక్ష్యాలు లేకుండా చేయడానికి, తన పేరు బయటకు రాకుండా చేయడానికి ప్రదోష్ కు 30 లక్షల రూపాయలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో దర్శన్ అంగీకరించాడు. ఈ కేసులో ప్రదోష్ 14 ముద్దాయిగా వున్నాడు. ఇప్పుడు అతడు అప్రూవర్ గా మారాడు. ప్రదోష్ ఇచ్చిన సాక్ష్యం కన్నడ నాట సంచలనం సృష్టిస్తుంది. రేణుస్వామిని ఎంత క్రూరంగా హింసించి చంపాడో తెలిసి విస్తుపోతున్నారు. ప్రదోష్ చెప్పిన భయంకరమైన వాస్తవాలు ఇలా వున్నాయి…
రేణుస్వామిని తీసుకొని వచ్చాక ఒక రహస్య ప్రదేశంలో బంధించారు. టాటా ఏష్ వాహనానికి కట్టేశారు. ఒంటి మీద లో దుస్తులు మినహా అన్నీ తొలిగించారు. నైలాన్ తాడు తో తీవ్రంగా కొట్టారు. దాడి తీవ్రతకు రేణు స్వామి తల నుంచి రక్తం కారింది. అలసిపోయిన అతడికి అన్నం తినిపించి, నీళ్లు తాగించి మళ్ళీ దాడి చేశాడు. ఛాతీ, మెడ మీద కొట్టాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన రేణు స్వామి స్పృహ తప్పి పడిపోయాడు. కింద పడిపోయిన రేణు స్వామి ఛాతీ మీద ఎక్కి తొక్కేందుకు ప్రయత్నించాడు. రేణు స్వామి మృతి చెందినట్లు గుర్తించి వదిలిపెట్టాడని ప్రదోష్ తెలిపాడు.
50కి పైగా సినిమాల్లో నటించిన హీరో దర్శన్ నిజ జీవితంలో విలన్ గా సమాజం ముందు తలవంచుకొని నిలబడ్డాడు. ఎన్నో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాల్లో నటించిన అతడిలో ఇంత క్రూరత్వం చూసి అభిమానులు, కన్నడ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అత్యంత క్రూరంగా హత్య చేయడమే కాకుండా దాన్నుంచి బయట పడేందుకు చేసిన ప్రయత్నాలు అతడిలోని నేర స్వభావాన్ని బహిర్గతం చేస్తుంది. ఒకప్పుడు లక్షలాది అభిమానుల జేజేలు అందుకున్న ఈ చాలెంజింగ్ స్టార్ ఇప్పుడు జైలులో ఒంటరిగా ఊచలు లెక్కబెడుతున్నాడు. అందుకే సినిమా హీరోలను గుడ్డిగా అభిమాణించవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
This post was last modified on August 10, 2026 8:04 pm
కొరియన్ కనకరాజు హిట్టయిపోయింది. మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేయడంతో వరుణ్ తేజ్ సంతోషం మాటల్లో చెప్పలేం. నాలుగు డిజాస్టర్ల…
సరిగ్గా పన్నెండు రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న టాక్సిక్, మకుటం కొన్ని విషయాల్లో చాలా సారూప్యతలు చూపిస్తున్నాయి. మొదటిది…
రాష్ట్ర శాసన సభ 7వ సమావేశాలు ఈ నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు…
ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్టుగా బెంగళూరు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఫైనల్ రన్…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే.. రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి అంతటి పోస్టు. ఈ పదవికి అనేక మంది వన్నె తెచ్చారు.…
మరో నాలుగు రోజుల్లో దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ…