కెజిఎఫ్ లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత నాలుగేళ్ళ పాటు ఎదురు చూడాల్సి వచ్చినా సరైన కథ కోసం వెయిట్ చేస్తూ చాలా సమయం ఖర్చు పెట్టిన హీరో యష్ ఇంకో పద్దెనిమిది రోజుల్లో టాక్సిక్ గా రాబోతున్నాడు. ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న ఈ వయొలెంట్ యాక్షన్ డ్రామా మీద ఎన్ని అంచనాలున్నాయో తెలిసిందే. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సమాంతరంగా షూట్ చేసిన టాక్సిక్ ని తెలుగుతో పాటు ఇతర లాంగ్వేజెస్ లో డబ్ చేయబోతున్నారు. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది.
4 నిమిషాల 38 సెకండ్ల సుదీర్ఘమైన వీడియోలో కంటెంట్ తాలూకు ఇంటెన్సిటీని పూర్తిగా పరిచయం చేశారు. నేర ప్రపంచంలో తల పండిన గ్యాంగ్ స్టర్ రాయ(యష్)కు జాలి దయా ఏమి ఉండవు. కన్న కొడుకైనా సరే లెక్క చేయని మనస్తత్వం. రాయ వారసుడు రూమీ (యష్) పెద్దయ్యాక ఎక్కడో అడవుల నుంచి నగరంలోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తాడు. వీళ్ళ జీవితంలో అయిదుగురు మహిళలు ఉంటారు. అసలీ హింసాత్మక నేపథ్యంలో ఎవరికెవరు ఏమవుతారో సినిమాలో చూడాలి.
పదే పదే బోల్డ్ సాంగ్స్ తో ఒక వర్గం ఆడియన్స్ కి దూరంగా అనిపించిన టాక్సిక్ ఈసారి పూర్తిగా మాస్ అప్పీల్ తో వచ్చింది. అభ్యంతరం అనిపించే సీన్లను జొప్పించకుండా కట్టిపడేసే విజువల్స్ తో ట్రైలర్ నింపేశారు. యానిమల్ షేడ్స్ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డిజైన్ చేసుకున్న తండ్రి కొడుకుల క్లాష్ ఎలా ఉంటుందనే దాని మీద అంచనాలు పెంచేలా కట్ చేశారు. యష్ రెండు షేడ్స్ లో భయపెట్టే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.
మేకర్స్ ఏ ఉద్దేశంతో ఈ మూవీ తీశారో దానికి అనుగుణంగా హైప్ పెరిగేలా టాక్సిక్ ట్రైలర్ కట్ ఉంది. ఇంత మోతాదులో హింసని జస్టిఫై చేయాలంటే కథా కథనాలు చాలా బలంగా ఉండాలి. రవి బస్రూర్ సంగీతం ఆయన స్టయిల్ లోనే సాగగా నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషిలకు మంచి ప్రాధాన్యం దక్కినట్టు కనిపిస్తోంది. ఆగస్ట్ 26 బ్లాస్ట్ అయ్యే ఓపెనింగ్స్ వచ్చేందుకు ఇది సరిపోతుంది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే రికార్డులు బడ్డల్లే.
This post was last modified on August 8, 2026 8:01 pm
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…