Movie News

సీనియర్లను ట్రోల్ చేస్తే ఎవరికి ప్రయోజనం

ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్ హీరో. క్లైమాక్స్ లో ఆరుగురు కమెడియన్లు ఆరుగురు స్టార్ హీరోల వేషాల్లో వచ్చి విలన్ డెన్ లో కామెడీ చేస్తారు. వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేశారు, ఏ మూవీ నుంచి తీసుకున్నారనేది సులభంగా గుర్తు పట్టేలా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, జాకీ చాన్ గెటప్స్ వేయించారు. ఈ ఎపిసోడ్ థియేటర్లలో ఓ రేంజ్ లో పేలింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

అప్పట్లో ఇలా చేయడం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బ తినలేదు. ఆయా హీరోలు ఆ చిత్రం చూసి స్పోర్టివ్ గా తీసుకున్నారు. మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి నటులను, రాజకీయ నాయకులను ఇమిటేట్ చేసి వందల జోకులతో నవ్వించడం కొన్ని వందల సార్లు జరిగింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కాలం. చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూపిస్తూ ట్రోలింగ్ పేరుతో ఆనందం పొందుతున్న వాళ్ళ సంఖ్య వందల వేల నుంచి లక్షలకు చేరుకొని క్రమంగా దేశాలు దాటిపోతోంది. కొత్త జడలు విప్పుకుంటోంది.

యుగపురుషుడు సినిమాలో ఎన్టీఆర్ సన్నివేశాన్ని తీసుకుని కొన్ని రోజుల క్రితం ఎక్స్, ఇన్స్ టాలో ఎంత రచ్చ చేశారో చూశాం. ఒక మాములు సీన్ కాస్తా ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. దీనికి కౌంటర్ ఇవ్వాలన్నట్టు చిరంజీవి జేబుదొంగ, ఆరని మంటలు లాంటి క్లిప్పులు పట్టుకొచ్చి వైరల్ చేసే ప్రయత్నం చేశారు. కొరియన్ కనకరాజులో సత్య పైన ఉదహరించిన ఎన్టీఆర్ డైలాగుని పలకడం మరో రాద్ధాంతానికి దారి తీసేలా ఉంది. చిన్నగా మొదలైన గొడవ కాంట్రావర్సీగా మారుతోంది.

ఫ్యాన్స్ ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది. కావాలని ఎగతాళి చేస్తే తప్పకుండా ఖండించాల్సిందే. కానీ అనుకరించే ప్రయత్నం చేస్తూ అందులో దురుద్దేశం ఉందొ లేదో చెక్ చేసుకోవాలి. దర్శకులు రచయితలు స్క్రిప్ట్ రాసే టైంలో మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతా జరిగాక వాటిని కట్ చేస్తే సరిపోదు. అప్పటికే డ్యామేజ్ అయిపోతుంది. అయినా సరే ఇలా ఎవరికి వారు ట్రోలింగ్ ఉచ్చులో పడి పరస్పరం కవ్వించుకుంటే చివరికి రిస్క్ లో పడేది టాలీవుడ్ పరువే. 

This post was last modified on August 8, 2026 10:14 am

Share

Recent Posts

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

47 minutes ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

1 hour ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

5 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

8 hours ago