Movie News

అసలైన అనిరుధ్ బయటికి వచ్చాడు

గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు తెగ ఫీలవుతున్నారు. ఈ గ్యాప్ వాడుకునేలా సాయి అభ్యంక్కర్ లాంటి కుర్రాడు దూసుకుపోతున్నాడని వాపోతున్నారు. వాళ్ళు అన్నదాంట్లో నిజం లేకపోలేదు. జన నాయకుడు, మదరాసి, ఇండియన్ 2, కింగ్డమ్, విదముయార్చి, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవేవి తన స్థాయిలో లేవనేది వాస్తవం. ఒకటి రెండు పాటలు తప్ప ఎలాంటి మేజిక్ చేయలేదు.

జైలర్, దేవర తర్వాత ఆ స్థాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనిరుధ్ రవిచందర్ నుంచి రాలేదు. అయితే తాజాగా విడుదలైన డిసి ఆ కొరత బాగానే తీర్చేలా ఉంది. ఎలాంటి హడావిడి, భీకరమైన సౌండ్లు లేకుండా సింపుల్ గా సాగిపోతూ, వెరైటీ సౌండ్స్ తో దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఆలోచనలకు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా బక్కోడు (ఫ్యాన్స్ పెట్టుకున్న ముద్దుపేరు) ఇచ్చిన నేపధ్య సంగీతం డాల్బీ అట్మోస్ థియేటర్లలో మోగిపోతోంది. సినిమా మీద పాజిటివ్ ఫీడ్ బ్యాక్ కి ఇదే ప్రధాన కారణం.

ముఖ్యంగా డిసిలో వ్యభిచార గృహం ఫైట్, వామిక గబ్బి విటుల దగ్గరికి వెళ్లి డబ్బులు వసూలు ఎపిసోడ్స్, ఇద్దరు కలిసి పోలీసులతో చేసే పోరాటం, క్లైమాక్స్ లాంటి వాటికి గొప్ప ఎలివేషన్ పడిందంటే దాని వెనుక ఉన్నది అనిరుధ్ రవిచందర్ స్కోరే. యూట్యూబ్ తో పాటు ఇతర ప్లాట్ ఫార్మ్స్ లో కీలకమైన సౌండ్ ట్రాక్స్ ముందే ఇవ్వడం బజ్ పరంగా ప్లస్ అయ్యింది. వాటిని విజువల్స్ తో పాటు థియేటర్లో ఆస్వాదిస్తూ అనిరుధ్ రవిచందర్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

కమర్షియల్ గా డిసి విజయం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం కానీ పికప్ మాత్రం అనూహ్యంగా ఉంది. గంటకు పది వేలకు పైగానే టికెట్లు అమ్ముడుపోవడం, వేగంగా బుక్ మై షో ట్రెండింగ్ లోకి రావడం శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అందరి చూపు నాని ది ప్యారడైజ్ మీద ఉంది. ఓ రేంజ్ ఎలివేషన్లు ఉన్న సబ్జెక్టు కావడంతో జడల్ జమానాకు థియేటర్లు ఊగిపోవాలంటే అనిరుధ్ పోషించే పాత్ర చాలా కీలకం కానుంది. అంచనాలు నిలబెట్టుకుంటే ఫ్యాన్స్ కు పండగే.  

This post was last modified on August 8, 2026 1:33 am

Share

Recent Posts

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

41 minutes ago

ప్యారడైజ్ టీం కాయదును హర్ట్ చేసిందా?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…

1 hour ago

రెండు పొరపాట్లు ఇంత మూల్యాన్ని చెల్లించాయి

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…

2 hours ago

దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. ఎమ్మెల్యే పదవి రద్దు!

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అన‌ర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ విష‌యాన్ని అసెంబ్లీ స్పీక‌ర్ ప్ర‌సాద్…

3 hours ago

బాలయ్య నాని రూటులో చిరు వెళ్లగలరా

గత నాలుగు రోజులుగా మెగాభిమానుల మధ్య జరుగుతున్న డిస్కషన్ ఒకటే. సంక్రాంతికి విశ్వంభర, కాకాలో ఏది విడుదలవుతుందనే దాని మీద…

4 hours ago

హాట్ హాట్‌గానే.. తెలంగాణ పాలిటిక్స్‌!

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గానే ఉన్నాయి. 22ఏ భూముల వివాదం.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కాయి.…

4 hours ago