ఎప్పుడో ఏడాది కిందట మొదలైన సినిమా ‘వకీల్ సాబ్’. ఇది రీమేక్ మూవీ. పక్కా స్క్రిప్టుతో షూటింగ్‌లోకి అడుగు పెట్టారు. మరీ భారీతనం ఉన్న సినిమా ఏమీ కాదు. లొకేషన్లు కూడా తక్కువ. కోర్ట్ రూంలోనే దాదాపు సగం సినిమా నడుస్తుంది. పవన్ అటు ఇటుగా నెల రోజుల డేట్లు ఈ సినిమాకు కేటాయించారు. ఆ డేట్లను కూడా రెండు నెలల వ్యవధిలోనే వాడుకోవాలని షరతు పెట్టారు. మిగతా సన్నివేశాల చిత్రీకరణకు నెలా నెలన్నర సమయం పట్టినా.. సినిమాను నాలుగు నెలల్లోపు పూర్తి చేసేయాలన్నది ప్రణాళిక. 2019 చివర్లో సినిమా సెట్స్ మీదికి వెళ్లగా.. ఫిబ్రవరికి చాలా వరకు సినిమా పూర్తయింది కూడా. దీంతో మార్చి-ఏప్రిల్ నెలల మధ్యలో చిత్రీకరణ పూర్తవుతుంది.. మే 15కు సినిమా థియేటర్లలో దిగుతుంది.. ఇక రచ్చో రచ్చస్యనే అని పవర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. కానీ అనూహ్యంగా కరోనా వచ్చి బ్రేక్ వేసింది.
లాక్ డౌన్ తర్వాత పవన్ లేకుండానే సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. అక్టోబరులో పవన్ కూడా షూటింగ్‌లోకి అడుగుపెట్టేశాడు. రెండు వారాల కిందటే పవన్ పాత్రతో ముడిపడ్డ అన్ని సన్నివేశాలనూ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా నుంచి పవన్ రిలీవ్ అయిపోయాడు. మిగతా సన్నివేశాలను కొన్ని రోజుల్లోనే పూర్తి చేసేశారు. మొత్తంగా టాకీ పార్ట్ పూర్తయిన విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్ శనివారం ట్విట్టర్లో వెల్లడించింది. ఇక తాము పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్తున్నట్లు ప్రకటించింది. ఆ పనులతో పాటే టీజర్ వర్క్ కూడా నడుస్తోంది. సంక్రాంతి కానుకగా ‘వకీల్ సాబ్’ టీజర్ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. 14న సాయంత్రం 6.03 గంటలకు టీజర్ రాబోతోంది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయాలన్నది దిల్ రాజు ప్లాన్.
This post was last modified on January 10, 2021 6:55 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…