ఒకప్పుడు కమల్ హాసన్ తన సినిమాల్లో రకరకాల వేషాల్లో కనిపించి అభిమానులను అలరించేవాడు. అప్పట్లో ప్రేక్షకులు కూడా ఈ తరహా పాత్రలు, కథల పట్ల ఆసక్తి చూపించేవాళ్లు. కానీ ఒక దశ దాటాక ఇవి మొహం మొత్తేశాయి. ముఖ్యంగా ‘దశావతారం’లో కమల్‌ను అన్నేసి వేషాల్లో చూశాక జనాలకు ఇకపై అలాంటివి రుచించని పరిస్థితి వచ్చేసింది. దీంతో ఇలా హీరో గెటప్‌లు మార్చే సినిమాలు వరుసగా బోల్తా కొట్టడం మొదలయ్యాయి. ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొన్నది విక్రమ్‌యే.
‘అపరిచితుడు’ వరకు అతను ఇలా చేస్తే బాగానే ఉండేది. కానీ తర్వాత ఈ వేషాలు తిప్పికొట్టడం మొదలయ్యాయి. మల్లన్న, ఐ, ఇంకొక్కడు లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. అయినా విక్రమ్ ఏమీ మారలేదు. ఇప్పుడు అతను ‘కోబ్రా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని టీజర్ శనివారమే విడుదలైంది.
ప్రపంచంలో ఏ సమస్యకైనా సరే.. గణితంలో సమాధానం ఉందని నమ్మే మ్యాథ్స్ టీచర్ కథ ఇది. గణితాన్ని ఆధారంగా చేసుకుని సమస్యలు పరిష్కరిస్తూ.. విలన్లను ముప్పు తిప్పలు పెడుతూ సాగుతుంటాడు హీరో. టీజర్ మొదలైనపుడు ఈ కాన్సెప్ట్ ఏదో బాగానే ఉందే అనుకుంటాం. కానీ ముందుకు సాగాక.. విక్రమ్ ఎప్పట్లాగే రకరకాల వేషాల్లో కనిపించి అతడి పాత సినిమాల్ని గుర్తు చేశాడు. ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా గుర్తుపట్టలేని రూపాల్లో అతను దర్శనమిచ్చాడు. ఆ వేషాలు చాలా ఎబ్బెట్టుగా కనిపించాయి తప్ప ఏమంత ఆసక్తి రేకెత్తించలేదు. ఓవరాల్‌గా టీజర్ అయితే ఏమంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు.
ఈ చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ పాత్ర చేయడం విశేషం. ఇంతకుముందు డిమాంటి కాలనీ, అంజలి ఐపీఎస్ చిత్రాలను రూపొందించిన అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని రూపొందించాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. టీజర్‌తో పోలిస్తే సినిమాలో ఏదైనా కొత్తగా చూపిస్తే తప్ప ‘కోబ్రా’ వర్కవుట్ కావడం కష్టమే అనిపిస్తోంది.
This post was last modified on January 9, 2021 5:11 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…