Movie News

‘జయం’లో బన్నీని పెట్టి తీసేశారా?

ఒక హీరోతో చేయాల్సిన కథ ఇంకో హీరో చేతికి వెళ్లిపోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఐతే పెద్ద ఫ్యామిలీకి చెందిన ఒక హీరోతో సినిమాను మొదలుపెట్టి.. తర్వాత అతణ్ని తీసేయడం మాత్రం అరుదే. అల్లు అర్జున్ విషయంలో ఇలాగే జరిగిందని అంటున్నాడు సీనియర్ రైటర్ చిన్నికృష్ణ. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన ‘గంగోత్రి’ సినిమాతో బన్నీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే.

ఐతే అంతకంటే ముందు టాలీవుడ్ లవ్ స్టోరీల చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ఒకటనదగ్గ ‘జయం’ సినిమాలో హీరో పాత్రకు బన్నీని తీసుకున్నాడట దర్శక నిర్మాత తేజ. కానీ ఏం జరిగిందో ఏమో.. కొన్ని రోజులకే అతణ్ని తప్పించి నితిన్‌ను తీసుకున్నాడట. ఈ విషయాన్ని చిన్నికృష్ణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

జయం సినిమాకు హీరోగా బన్నీని ఎంచుకున్నాక చిత్ర బృందం ఒక పార్టీ కూడా ఇచ్చాడని.. దానికి తాను కూడా హాజరయ్యానని.. కానీ రెండు మూడు రోజుల తర్వాత పేపర్లో ఈ సినిమాకు సంబంధించిన వార్తలో హీరోగా నితిన్ పేరు కనిపించడంతో తాను ఆశ్చర్యపోయినట్లు చిన్నికృష్ణ తెలిపాడు.

మరి బన్నీని తేజ ఎందుకు తీసేశాడన్నది తనకు తెలియదని చెప్పాడు. ‘జయం’ సినిమా బన్నీ చేజారడంతో అతడి అరంగేట్ర సినిమా కోసం తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పటికే రజినీకాంత్ సినిమా ‘నరసింహ’కు కథ అందించిన తాను.. ఆయన నటించే మరో సినిమాకు పని చేయాల్సి ఉందని, కానీ బన్నీ కోసం ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుని మళ్లీ న్యూట్రల్ లోకి వచ్చి, ఫస్ట్ గేర్‌లో ప్రయాణం చేయాల్సి వచ్చిందని చిన్నికృష్ణ వ్యాఖ్యానించాడు.

తన కథతో హీరోగా పరిచయం అయిన బన్నీ ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉండడం తనకు గర్వకారణమని చిన్నికృష్ణ చెప్పాడు. బన్నీ నటించిన ‘బద్రీనాథ్’ చిత్రానికి కూడా చిన్నికృష్ణే కథ అందించిన సంగతి తెలిసిందే.

This post was last modified on July 24, 2026 9:12 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

32 minutes ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

2 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

3 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

5 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

6 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

7 hours ago