Political News

కొడుకును తప్పించాలని చూసిన వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కొడుకు ఆరవ్ ను హిట్ అండ్ రన్ కేసు నుంచి తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే అప్పల రాజును అరెస్టు చేసేందుకు పోలీసులు కాశీబుగ్గలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అప్పల రాజు ఇంటి దగ్గరకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు అప్పలరాజును పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు.

కొద్ది రోజుల క్రితం సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మ అతివేగంగా బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్యను గుద్దాడు. ఆ ప్రమాదంలో దానయ్య చనిపోయాడు. అయితే, బైక్ నడిపింది ఆరవ్ కాదని, ఆరవ్ స్నేహితుడు సిద్దార్థ అని నమ్మించేందుకు అప్పలరాజు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆరవ్ ను తప్పించేందుకు సాయపడ్డారని ఆరోపణలు రావడంతో స్థానిక ఎస్ ఐని కూడా సస్పెండ్ చేశారు.

అంతేకాదు, బాధిత కుటుంబానికి డబ్బులిచ్చి ప్రలోభపెట్టాలని చూశారని కూడా అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. ప్రమాదానికి కారణమైన బైకును కూడా మాయం చేసి నేరాన్ని కప్పిపుచ్చారని అప్పలరాజుపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే పలు సెక్షన్ల కింద అప్పలరాజుపై కేసులు నమోదయ్యాయి.

అంతకుముందు, ఆరవ్ అరెస్టుపై జగన్ స్పందించిన తీరు విమర్శలపాలైన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల చిన్న పిల్లాడు తెలిసీతెలియక యాక్సిడెంట్ చేస్తే హోమీసైడ్ సెక్షన్ల కింద మర్డర్ కేసు పెడతారా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలపాలయ్యాయి. క్లియర్ గా ఆరవ్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. అయినప్పటికీ, అప్పలరాజుపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే ఆరవ్ పై హోమీసైడ్ సెక్షన్ల కింద మర్డర్ కేసు నమోదు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం.

This post was last modified on July 22, 2026 7:59 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

29 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

58 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago