తెలుగులో ‘బిగ్ బాస్’ షోను ముందు చాలా తక్కువగా అంచనా వేశారు కానీ.. దాని రీచ్ ఊహించని స్థాయికి చేరుకుంది. ‘బిగ్ బాస్’ కొత్త సీజన్ మొదలైందంటే ప్రతి ఇంట్లోనూ షో సమయానికి జనాలు టీవీల ముందు కూర్చునేస్తున్నారు. ఇంట్లో ఎవరో ఒకరు.. లేదా ఒకరికి మించి ‘బిగ్ బాస్’ ఫ్యాన్స్ ఉంటున్నారు. ఈ షో విషయంలో కొన్ని విమర్శలు, వ్యతిరేకత కూడా ఉన్న మాటే కానీ.. దానికున్న ఆదరణ మాత్రం కొట్టి పారేయలేంది.
‘బిగ్ బాస్’లోకి రావడానికి ముందు లైమ్ లైట్లో లేని వాళ్లు ఈ షోలో పాల్గొన్నాక సెలబ్రెటీలైపోతున్నారు. అంతకుముందు అవకాశాలు రాక ఇబ్బంది పడ్డవాళ్లు షో ద్వారా వచ్చిన పాపులారిటీతో కెరీర్లో బిజీ అయిపోతున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల కెరీర్లు బాగా ఊపందుకునేలా సంకేతాలు కనిపిస్తుండటం విశేషం.
‘బిగ్ బాస్’ నుంచి రావడం ఆలస్యం.. సోహెల్ తాను హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అతను హీరోగా మరో సినిమా కూడా చర్చల దశలో ఉందట. అలాగే షో మధ్యలోనే నిష్క్రమించిన దివి.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమలో ఓ పాత్రకు ఎంపికైంది. ఆమె కథానాయికగా రెండు సినిమాలకు సన్నాహాలు జరుగుతుండటం విశేషం. మెహబూబ్‌కు సైతం సినిమాల్లో అవకాశాలు వస్తున్నట్లు చెబుతున్నారు. ఇక ఆల్రెడీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో మంచి పేరు సంపాదించిన అవినాష్ ఇప్పుడు సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. అతడికి ‘ఎఫ్-3’లో మంచి కామెడీ రోల్ దక్కిందట.
మరోవైపు లాస్య టీవీ కెరీర్ మళ్లీ ‘బిగ్ బాస్’ పుణ్యమా అని ఊపందుకుంది. ఒకప్పటి తన హోస్టింగ్ పార్టనర్ రవితో కలిసి ఆమె కొత్తగా ఒక షోకు యాంకరింగ్ చేస్తోంది. ఇంకో రెండు షోలు ఆమె చేతిలో ఉన్నాయట. ఇక మోనాల్ సైతం ఒక టీవీ షోలో భాగమైంది. అలాగే ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది. మరికొన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టేలా ఉన్నాయి.
ఇక ‘బిగ్ బాస్’ విజేతగా నిలిచిన అభిజిత్ హీరోగా మళ్లీ సినిమాలు రాబోతున్నాయని.. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అరియానాకు కూడా టీవీ షోల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయట. ‘బిగ్ బాస్’ రన్నరప్‌గా నిలిచిన అఖిల్ గురించైతే ఏ కబురూ లేదు. మొత్తానికి ఈ షో ద్వారా చాలామందే తమ కెరీర్లను దిద్దుకునేలా కనిపిస్తున్నారు.
This post was last modified on January 8, 2021 10:22 am
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…