Movie News

మహేష్ బాబాయ్ దిగితేనే హైప్ వస్తుంది

ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం నుంచి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం దాదాపుగా బయటికి వచ్చేసింది. ట్రైలర్, పాటల లాంఛనాలు పూర్తయిపోయాయి. హీరో జయకృష్ణ టూర్లు వేసుకుని తెగ ప్రమోట్ చేస్తున్నాడు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసుకుని టీమ్ చాలా కష్టపడుతోంది. ఇంత చేసినా ఎక్కడో ఏదో మిస్ అయినట్టు ఆశించిన బజ్ ఇంకా రావడం లేదనేది వాస్తవం.

ఇప్పుడు అందరి కళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఉన్నాయి. ఇది చాలా స్పెషల్. ఎందుకంటే మహేష్ బాబు గెస్టుగా వస్తున్నారు కాబట్టి. అన్నయ్య రమేష్ బాబు అంటే తనకు ఎంత అభిమానమో తెలిసిందే. కెరీర్ పరంగా అన్న వెనుకబడినప్పుడు అర్జున్ అన్ననే నిర్మాతగా మార్చి తీయించారు మహేష్ బాబు. అలాంటి రమేష్ బాబు కొడుకు జయకృష్ణ తెరంగేట్రం అంటే వీలైనంత వెనుక ఉండి నడిపించాల్సిన బాధ్యత తన మీద ఉంది. అందుకే ఫ్యాన్స్ ఇంతగా ఎదురు చూస్తున్నారు.

ఒక బాబాయ్ గా మహేష్ ఆ వేడుకలో అన్నతో జ్ఞాపకాలు, జయకృష్ణతో బాండింగ్, ఈ సినిమాలో తన ఇన్వాల్వ్ మెంట్ ఏ మేరకు ఉంది లాంటి విషయాలన్నీ పంచుకునే అవకాశం ఉంది. ఈ స్పీచ్ కనక కనెక్ట్ అయితే మరింత మద్దతు ఘట్టమనేని అభిమానుల నుంచి దక్కుతుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొందరు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు మహేష్ ఈవెంట్ కు వచ్చాక చూద్దాంలే అనే ధోరణిలో వెయిట్ చేస్తున్నారు. అప్పటిదాకా సైలెంటేనేమో.

సుధీర్ బాబు ఇదే తరహాలో హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని చాలా ట్రై చేశాడు కానీ పనవ్వలేదు. వరస ఫ్లాపులు మార్కెట్ ని బాగా దెబ్బ కొట్టాయి. ఎంత కష్టపడినా ఫలితం లేకపోయింది. అయితే తను కృష్ణగారికి నేరుగా రక్త సంబంధం కాదు కాబట్టి ఆ కేసు వేరు. కానీ జయకృష్ణ అలా కాదు. స్వయానా పెద్ద కొడుకు కొడుకు అంటే మొదటి మనవడు. ఆ ఎమోషనే అభిమానులను థియేటర్ కు రప్పించాలి. కంటెంట్ తో దర్శకుడు అజయ్ భూపతి కనక మెప్పిస్తే మిగిలింది ప్రేక్షకులు చూసుకుంటారు.  

This post was last modified on July 18, 2026 12:47 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

10 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago