Movie News

మా ఇంటి బంగారం… వివాదానికి తెర?

గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తెలుగులో ఈ ఘనత సాధించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. ఇంకా థియేటర్లలో ఒక మోస్తరుగా ఆడుతున్న సమయంలోనే ముందు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జియో హాట్ స్టార్ నిన్న అర్ధరాత్రి నుంచి ‘మా ఇంటి బంగారం’ను స్ట్రీమ్ చేస్తోంది. ఐతే థియేటర్లలో ఈ సినిమా చూసిన వాళ్లు.. డిజిటల్ వెర్షన్ చివర్లో ఉన్న వివాదాస్పద టైటిల్ కార్డ్ మిస్ కావడం గమనిస్తున్నారు. 

‘మా ఇంటి బంగారం’ థియేటర్ వెర్షన్ చివర్లో ‘FUSN, IYKYK’ అని ఎండ్ టైటిల్స్‌లో వేశారు. ఇది ఈ చిత్ర సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్‌కు కౌంటర్ అని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి పాటల పని మాత్రమే పూర్తి చేసిన సంతోష్.. బీజీఎం విషయంలో హ్యాండ్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. దీంతో అప్పటికప్పుడు హడావుడిగా ఇద్దరు ముగ్గురు వేరే సంగీత దర్శకులతో పని చేయించుకోవాల్సి వచ్చిందట టీమ్. 

ఈ విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ టీం.. సంతోష్ నారాయణన్‌కు కౌంటర్ ఇస్తూ ఎండ్ టైటిల్స్‌లో ఆ మెసేజ్ ఇచ్చారని గుసగుసలు వినిపించాయి. ఐతే సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో దీని మీద పంచాయితీ జరిగి ఉండొచ్చు. ఇరు వర్గాలు మాట్లాడుకుని వివాదానికి తెరదించి ఉండొచ్చు. లేదా ఆల్రెడీ జరిగిన రచ్చ చాలని టీం డిజిటల్ వెర్షన్లో ఈ మెసేజ్‌ను తీసేసి ఉండొచ్చు. ఈ వివాదం మీద ‘మా ఇంటి బంగారం’ టీం కానీ.. సంతోష్ నారాయణన్ కానీ ఎలాంటి కామెంట్లు చేయలేదు. కానీ ఈ సినిమా ప్రమోషన్లలో సంతోష్ ఎక్కడా పాల్గొనలేదు. అతడి వర్క్ గురించి టీంలో ఎవ్వరూ పెద్దగా మాట్లాడలేదు.

This post was last modified on July 17, 2026 7:15 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

3 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

8 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

8 hours ago