మన అగ్ర హీరోలందరూ ఇప్పుడు తెలుగు మార్కెట్‍ని దాటి తమ మార్కెట్ ఎలా విస్తరించుకోవాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోగా, ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ ‘ఆర్.ఆర్.ఆర్.’తో ఆ హోదా సాధిస్తామనే ధీమాతో వున్నారు. అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి తనతో సినిమా చేసే వరకు వేచి చూడకుండా సుకుమార్ చేస్తోన్న ‘పుష్ప’తోనే పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసాడు. మహేష్ కూడా త్వరలోనే రాజమౌళితో సినిమా చేస్తాడు కనుక ఆ బెంగ లేదు. కొందరు యువ హీరోలు ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు లాంఛ్ చేసేసారు.
ఇదిలావుంటే టయర్ 2 హీరోలలో నంబర్‍వన్‍గా కొనసాగుతోన్న నాని కూడా పాన్ ఇండియా మార్కెట్‍పై దృష్టి పెట్టవచ్చునని అంటున్నారు. శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని వేరే భాషలలో విడుదల చేస్తామనేది ఇంకా ప్రకటించలేదు కానీ ఆ ఐడియా అయితే వుందట. సినిమా బాగా వచ్చిందనే కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలోకి అనువదిస్తారట. పునర్జన్మ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోల్‍కతా నేపథ్యంలో వుంటుంది. నాని ఇందులో ఒక రచయితగా వినూత్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
This post was last modified on January 8, 2021 2:19 am
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…
తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును…
ఏపీ సీఎం చంద్రబాబు విషయం గురించి చెబుతూ… మంత్రి నారాయణ ఒక మాట చెప్పారు. "మనం వచ్చే రెండు మూడేళ్ల…
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…