Movie News

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు ఇతర బాషల ప్రేక్షకులు పెద్ద తెరమీద చూడలేదు కాబట్టి డిజిటల్ వ్యూస్ భారీగా వస్తాయని అటు నెట్ ఫ్లిక్స్ తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా ఇంకా వారం కాకుండానే పెద్ది టాప్ 5లోనే ఉండటం షాక్ కలిగిస్తోంది. నిజానికి జనాలు అంచనా వేసింది ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుందని.

టీవీలో స్మార్ట్ ఫోన్లలో చూసిన ఉత్తరాది జనాలు పెద్దిలో చరణ్ నటనకు ప్రశంసలు అందిస్తున్నారు కానీ కంటెంట్ పట్ల మాత్రం పెదవి విరుపులే వినిపిస్తున్నాయి. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు వాళ్ళు చాలా చూసేసి ఉండటం ఒక కారణమైతే దర్శకుడు బుచ్చిబాబు చూపించిన మాస్ క్రికెట్ వాళ్లకు అంతగా ఎక్కలేదు. ట్రోలింగ్ కి ఆస్కారం ఇచ్చేలా ఇలాంటి ఆట చూపిస్తారా అంటూ ఎక్స్ లో ట్వీట్లు పెట్టేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఎక్కువ నెగటివ్ టాక్ నడుస్తోంది.

జరిగిపోయిన కథ గురించి ఇప్పుడు ఎందుకంటే కారణాలు లేకపోలేదు. రెండు మూడు సంవత్సరాలు మనం ఎలాంటి కథల మీద వర్క్ చేస్తున్నామో దర్శకులు గుర్తించాలి. ప్యాన్ ఇండియా స్టాంప్ వేసేసి, బడ్జెట్ లు పెంచేసి, నిర్మాతల మీద భారం పెట్టేసి కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను మెప్పించే పనైతే వందల కోట్లు ఖర్చు పెట్టడం వలన లాభం లేదు. ఓవర్సీస్ లో కనీసం బ్రేక్ ఈవెన్ కాకపోతే టయర్ 1 హీరోల మార్కెట్ రిస్కులో పడుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో.

పెద్దిని ఒక పాఠంగా చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎక్కువ కాలం ఖర్చు పెట్టినంత మాత్రాన సానుభూతితో ఆడియన్స్ సినిమాలు చూసేయరు. అలా అయితే అంజి నుంచి రాజా సాబ్ దాకా కేవలం సింపతీ మీద డబ్బులు తెచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. రంగస్థలంని మించి ఉంటుందని పదే పదే ఊదరగొట్టిన పెద్ది బృందం రామ్ చరణ్ నుంచి బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే రాబట్టుకుంది కానీ సబ్జెక్టులో అసలైన దమ్ముని ప్రేక్షకులకు ఇవ్వలేకపోయింది. 

This post was last modified on July 15, 2026 6:49 pm

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

3 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

4 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

6 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

8 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

8 hours ago