ఇవాళ లెనిన్ విడుదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల ఉదయం అయిదు గంటల నుంచే షోలు మొదలైయ్యాయి. చాలా కాలం తర్వాత అఖిల్ మూవీకి ఇంత ఎర్లీ ప్రీమియర్లు పడటంతో తెల్లవారుజాము నుంచే అక్కినేని అభిమానుల సందడి కనిపించింది. అందులోనూ అయ్యగారు కంబ్యాక్ అవ్వాలని వాళ్ళే కాదు సగటు సినీ ప్రియులు కూడా కోరుకున్నారు. ఎందుకంటే సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం అఖిల్ చేస్తున్న పోరాటం దశాబ్దంకి పైగా కొనసాగుతూనే ఉంది.
ఇక లెనిన్ విషయానికి వస్తే మొదటి రోజు మంచి ఓపెనింగ్ దక్కేలా ఉంది. ఎక్స్ ట్రాడినరి టాక్ రాలేదు కానీ ఉన్నంతలో బాగుందనే నుంచి పర్లేదనే తరహాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ రివెంజ్ డ్రామాగా రూపొందిన లెనిన్ లో అఖిల్ నటనకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. క్లైమాక్స్, ప్రారంభ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ లో పరిణితి చూపించాడని ఆడియన్స్ మాట్లాడుకోవడం కనిపిస్తోంది.
ప్రారంభమయ్యింది ఇప్పుడే కాబట్టి ఫైనల్ స్టేటస్ ఏ దిశగా వెళ్తుందనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. బుక్ మై షోలో గంటకు 8 వేలకు పైగా టికెట్ల అమ్మకాలతో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్న లెనిన్ వీకెండ్ దాకా ఇదే జోరు కొనసాగిస్తే పెద్ద నెంబర్లు తోడవుతాయి. టాక్ తో సంబంధం లేకుండా ఒకసారి చూడాలనుకున్న న్యూట్రల్ ఆడియన్స్ కనక పెద్ద శాతంలో ఉంటే నిర్మాతలు నాగవంశీ, నాగార్జున కోరుకున్న సక్సెస్ దక్కినట్టు అవుతుంది.
అయితే అఖిల్ కెరీర్ లో పెర్ఫార్మన్స్ పరంగా లెనిన్ నెంబర్ వన్ అవుతుందా లేదానే పాయింట్ చర్చకు రాదు. చేసింది ఆరు సినిమాలే కాబట్టి ఆ స్టేట్మెంట్ అవసరం లేదు కానీ తన మెచ్యూరిటీకి లెనిన్ చక్కని వేదికగా నిలిచిందనేది వాస్తవం. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భాగ్యశ్రీ బోర్సే పాత్ర, ఊహించని ట్విస్టులు ప్లస్ గా నిలుస్తున్న లెనిన్ సాధారణ ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ అందుకుంటుందో ఓ నాలుగైదు షోలు అయిపోయాక స్పష్టత వస్తుంది. మొత్తానికి అయ్యగారి సందడి బాగానే ఉంది.
This post was last modified on July 10, 2026 12:36 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…