Movie News

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ టికెట్ రేట్లు పెరగడం వల్ల ఆడియన్స్ తగ్గలేదని, దానికన్నా పాప్ కార్న్ ధరలకు భయపడి రాకుండా ఆగిన వాళ్ళే ఎక్కువని స్టేట్ మెంట్ ఇచ్చారు. దీని పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చెప్పిన ప్రకారం టికెట్లు ఎంత రేటు పెట్టినా జనాలు వస్తారు కానీ ఫుడ్డు వల్లే ఆగిపోతున్నారు.

ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే ఇందులో ఉన్న పాక్షిక డొల్లతనం బయటపడుతుంది. ఎందుకంటే సినిమా కోసం థియేటర్ కు వచ్చే వాళ్ళలో క్యాంటీన్ కు వెళ్లి తిను బండారాలు, కూల్ డ్రింక్స్ తీసుకునే శాతం 30 నుంచి 40 శాతం లోపే ఉంటుంది. ఇది ఏ ఎగ్జిబిటర్ ని అడిగిన లెక్కలతో సహా చెబుతాడు. ఒకవేళ వచ్చినవాళ్ళందరూ కొనే పనైతే ఒక్కో సింగిల్ స్క్రీన్ లేదా మల్టీప్లెక్సుల్లో రెండు మూడు క్యాంటీన్లు పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు స్నాక్స్ ఎగబడి కొనేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి బాగా తగ్గిపోయింది.

ఇంకో ముఖ్యమైన పాయింట్ చూడాలి. టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఒక హిట్ సినిమాకు రిపీట్ వచ్చే అభిమానులు తగ్గిపోయారు. ఒకసారి చూసి సర్దుకుంటున్నారు. ప్రీమియర్ కు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టిన ఫ్యాన్స్ వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చే సాహసం చేయడం లేదు. ఎందుకంటే పది రోజుల దాకా ఒక్కో టికెట్ మీద కనిష్టంగా వంద రూపాయల పెంపు ఉంటుంది కాబట్టి. ఇక పాప్ కార్న్ గురించి ఆలోచించే బడ్జెట్ ఎక్కడ నుంచి వస్తుంది.

మరో కోణం ఉంది. చిన్న సినిమాలకు ప్యాన్ ఇండియా మూవీస్ కి మాములు రోజుల్లో ఒకటే రేటు ఫిక్స్ చేస్తున్నారు. రామ్ చరణ్, సమంత లాంటి స్టార్స్ కు 200 రూపాయలు పెట్టేవాళ్ళు అదే మొత్తాన్ని ముక్కుమొహం తెలియని ఆర్టిస్టులున్న సినిమాకు ఎందుకు ఖర్చు చేస్తారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు ఆ దిశగా ఆలోచన చేయరు. ఎవరైనా 99 రూపాయల ఐడియాలతో వచ్చి వాటిని అమలు చేస్తే ఫోన్ల ద్వారానే వాటిని కట్టడి చేసిన ఉదంతాలు ఎప్పుడో కాదు గత ఏడాదే జరిగాయి.

బస్ స్టాండ్ లో హోటల్ రేట్లు ఎక్కువున్నాయని ప్రయాణికులు ఊళ్లకు వెళ్లడం మానుకోవడం ఎక్కడైనా చూశామా. ఎయిర్ పోర్ట్ లో తిండి పదార్థాలు ఖరీదని విమానం ఎక్కని ప్యాసింజర్లు హిస్టరీలో లేరు. అవసరాలు మన నిర్ణయాలను శాశిస్తాయి. సినిమా చూసే తీరాలనుకున్నవాళ్ళు పాప్ కార్న్ కోసం ఆలోచించరు. టికెట్ల వరకు డబ్బులు పోగు చేసుకుని ఇంటర్వెల్ లో సైలెంట్ గా ఉండిపోతారు. అంతే తప్ప తినడం ఖరీదైపోయిందని వినోదాన్ని వద్దనుకునేది ఎవరు.

This post was last modified on July 7, 2026 9:42 am

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

9 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

11 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

11 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

11 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

13 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

16 hours ago