Movie News

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా ఆదరించారు. అంతకు ముందు మహానటి, రంగస్థలం, అర్జున్ రెడ్డి, ఆర్ఆర్ఆర్ లాంటివి మూడు గంటలకు దగ్గరగా ఉన్నా కనకవర్షం కురిసింది. అలాని ఇది ప్రతి సినిమాకు అప్లై చేస్తే ఇబ్బందవుతుంది. జనం స్పందన చూశాక కత్తిరింపులు చేసినా, రీ ఎడిటింగ్ చేసినా లాభం ఉండదు. ఏదైనా సరే స్క్రీన్ మీద మొదటి షో పడేలోపే అయిపోవాలి. లేదంటే చాలా నష్టం.

తాజాగా విడుదలైన నాగబంధంకు నిడివి విషయంలో కంప్లైంట్స్ వచ్చాయి. దెబ్బకు మూడో రోజే ఇరవై నిమిషాల కోత విధించారు. కానీ లెన్త్ వల్ల వచ్చిన నెగటివ్ టాక్ సోషల్ మీడియాలో బాగా పాకిపోయింది. పెద్ది విషయంలోనూ ఈ పొరపాటు జరిగింది. దాన్ని సరిదిద్దుకుందామని శివరాజ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ లాంటివి తీసేసినా ప్రయోజనం కలగలేదు. ఇలా జరగడం మొదటిసారి కాదు. అంటే సుందరానికి టైంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ మొండిపట్టు థియేటర్ రన్ ని ప్రభావితం చేసింది.

ఒకప్పుడు దానవీరశూరకర్ణ 3 గంటల 45 నిముషాలతో రెండు ఇంటర్వెల్స్ వేసినా వసూళ్లు సునామిలా వచ్చాయి. హం ఆప్కె హై కౌన్ ది కూడా ఇలాంటి చరిత్రే. ఇప్పటి జెన్ జీ మూవీ లవర్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ల్యాగ్ వచ్చిందంటే దానికి బాధ్యత కేవలం ఎడిటర్ ఒక్కడిదే కాదు. దర్శకుడి సూచనల మేరకే ఏం పెట్టాలి ఏం తీసేయాలనే నిర్ణయం జరుగుతుంది. అవసరమైన చోట కీలకమైన మార్పులు ఎడిటర్ సూచిస్తాడు. వాటిని పాటించడం పాటించకపోవడం డైరెక్టర్ ఇష్టం.

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా సరే దర్శకులు ఒకటికి రెండుసార్లు నిడివి గురించి అలోచించి నిర్ణయాలు తీసుకోవడం బెటర్. ఎవరినో చూసి ఎవరో వాత పెట్టుకున్నట్టు అందరూ ఒకేదారిలో వెళ్తే అందులో కిందపడే వాళ్ళు కూడా ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ శాతమే ఎక్కువ. ప్రేక్షకుడు ఒక ప్యాన్ ఇండియా మూవీ కోసం ఎదురు చూసినంత సహనం థియేటర్ సీట్లో కూచున్నాక ప్రదర్శించడు. షూటింగ్ ఆలస్యమైనా భరిస్తాడు కానీ తెరమీద నెమ్మదితనం ఉంటే తట్టుకోలేడు. నెగటివ్ గా చెప్పేస్తాడు. ఇకనైనా మేకర్స్ ఆలోచనా ధోరణిలో మార్పు రావడం చాలా అవసరం. లేదంటే చేతులు కాలాక పట్టుకోవడానికి ఆకులు ఉండవు.

This post was last modified on July 6, 2026 7:33 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

4 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

6 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

6 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

8 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

9 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

10 hours ago