ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ ప్లస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న బేబి ఫేమ్ సాయిరాజేష్ పేరు మీద మార్కెటింగ్ చేస్తుండటంతో యువతలో దీని మీద ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రాజా సాబ్ దెబ్బకు కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న ఎస్కెఎన్ మళ్ళీ తన స్వంత మూవీ కోసం బయటికి వచ్చారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియా జంటను ప్రేక్షకులు ఫ్రెష్ గా ఫీలవుతున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ చెన్నై లవ్ స్టోరీని ముందు నుంచి మ్యూజికల్ ట్రీట్ గా ప్రొజెక్ట్ చేయడం చూస్తున్నాం. ప్రతి పాటని పెద్ద ఎత్తున ఈవెంట్లు చేసి రిలీజ్ చేశారు. మణిశర్మ మేజిక్ మళ్లీ రుచి చూస్తారని టీమ్ పదే పదే ఊరించింది. మొదటి సాంగ్ దానికి తగ్గట్టే సంగీత ప్రియులను మెప్పించింది. అయితే వదలనే వదలనే అంటూ సాగే రెండో సాంగ్ కు అంత రెస్పాన్స్ రాలేదు. జిగితారకు డీసెంట్ స్పందన దక్కగా కొత్తగా వచ్చిన పాట హోలియా హోలియాని పబ్లిక్ లోకి పూర్తిగా వెళ్ళలేదు.
ఇలాంటి సినిమాలకు బజ్ రావాలంటే పాటలను వీలైనంత కొత్త పద్ధతుల్లో వైరల్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. గీత గోవిందంలో ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ మొదటి రోజు ఓపెనింగ్స్ కి మంత్రంలా పని చేయడం అబద్దం కాదు. బేబికి విజయ్ బుల్గానిన్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్ చాలా పెద్దది. మణిశర్మ వాటిని ఈజీగా దాటేసే ఆల్బమ్ ఇచ్చారని చెన్నై బృందం పదే పదే చెబుతూ వచ్చింది. కానీ క్షేత్ర స్థాయిలో ఇంకాస్త బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది.
లెనిన్ తర్వాత రిలీజయ్యే చెప్పుకోదగ్గ సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ ఒకటి. ఇంకా ట్రైలర్ వదల్లేదు. హైదరాబాద్ లో అవకాశాలు దొరక్క చెన్నై వెళ్లి ట్రయిల్స్ వేస్తున్న ఒక యువ దర్శకుడికి ఎదురైన అనుభవాలు, జీవితం మీద విరక్తి పుట్టిన అమ్మాయితో మొదలైన ప్రేమకథ వగైరాల బ్యాక్ డ్రాప్ తో ఇందులో చాలా ట్విస్టులు ఉంటాయట. క తర్వాత దిల్ రుబా నిరాశపరిచినా కె ర్యాంప్ తో మళ్ళీ సక్సె బాటలో పడ్డ కిరణ్ అబ్బవరంకి ఇది బ్లాక్ బస్టర్ అయితే మార్కెట్ పరంగా పెద్ద ప్రమోషన్ దక్కుతుంది.
This post was last modified on July 6, 2026 6:48 pm
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…